విశాఖ: బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. మాండ్లాకు దక్షిణ దిశగా 50కి.మి దూరంలో తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని, క్రమంగా ఇది
పశ్చిమ వాయువ్య దిశగా మారి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో వైపు తెలంగాణలో రుతుపవనాలు చరుగ్గా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో రాగల 24గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ప్రత్యేకించి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment