ముంబయి: నలుపే మెరుపని, నలుపుకూ ఓ గుర్తింపు తేవాలని ప్రముఖ నటి, నేషనల్ అవార్డు గ్రహీత 'నందితాదాస్' చేస్తున్న ప్రయత్నాలకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. యాడ్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఫెయిర్‌నెస్ ప్రాడెక్టులపై
ఓ రకంగా నలుపు యుద్ధాన్నే ప్రకటించింది. అదేంటో ఓ సారి చూసొద్దాం...కుదిరితే ప్యారిస్ పౌడర్...కుదరకపోతే పాండ్స్ పౌడర్. ఏదైనా తెలుపు కోసమే. వాట్ ఈజ్ బ్యూటీ అంటే వైట్ ఈజ్ బ్యూటీ అంటున్నారు. కలర్ కోసం కమర్షియల్ యాడ్స్ సునామీయే సృష్టిస్తున్నాయి. కాకపోతే తెల్లని కాగితంపై నల్లని చార ఎంత అందంగా ఉంటుందో మర్చిపోతున్నాయి. దీన్ని గుర్తు చేసేందుకే మొదలైంది బ్లాక్ క్యాంపెయిన్. నలుపు ఓ నేరం... నలుపు ఓ ఘోరం..నలుపంటేనే భయం. అవును అమ్మమ్మల నుంచి మొదలుపెడితే నేటితరం అమ్మాయిల వరకు నలుపుపై ఇదే భావం. కాని నలుపే మెరుపు అని ప్రూవ్ చేయాలనుకుంటోంది ఓ సెలబ్రిటీ. ఎన్నో ఏళ్లుగా తెలుపు తాకిడికి మసకబారుతున్న నలుపుకు సాధికారిత లభించనుంది. ఇప్పటి వరకు మీరు ఫెయిర్‌నెస్ కోసం జరుగుతున్న ప్రచారాన్నే చూశారు. ఇప్పుడు నలుపుకు కూడా ఓ అర్థం ఉంది అని తెలుసుకోబోతున్నారు. డార్క్ నెస్‌లోనూ అందం దాగుందని చూడబోతున్నారు.
నలుపు కూడా అందమే అంటున్న నందితా
సినిమా ఎంపికలోనూ, యాక్షన్‌లోను మిగతా హీరోయిన్లతో పూర్తిగా భిన్నత్వాన్ని చూపించే మోస్ట్ పాపులర్ యాక్టర్ నందితాదాస్ ఇక్కడా తన మార్క్ ను చూపించారు. టాప్ సెలబ్రిటీలంతా ఫెయిర్‌నెస్ ప్రాడెక్టు కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంటే నందితా దానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. నలుపు కూడా అందమైనదేనని ప్రచారం చేస్తున్నారు. నందితా ఈ కార్యక్రమం చేపట్టడానికి బలమైన కారణాలే ఉన్నాయి.నందితాను చాలా మంది అడిగారట మీ విజయానికి నలుపు ఎప్పుడూ ఆటంకం కాలేదా అని. అమ్మాయిలు అడిగిన ఆ ప్రశ్నల్లోనే నలుపుపై వారికున్న అపరాదభావం అర్థమైందని నందితా తన బ్లాగ్‌లో రాసుకుంది.నల్లగా ఉండటం నేరం, పెళ్లికి తాము పనికిరాము, అందంగా కనిపించలేము అన్న అభద్రతా భావంతో చాలా మంది అమ్మాయిలున్నారని చెప్పారు. అమ్మాయిలే కాదు వారి తల్లిదండ్రుల నిశ్శబ్ధ కన్నీళ్ల వెనుక ఇదే భావన దాగుందని ఆమె అన్నారు. ఈ భావం నుంచి వారిని బయటపడేసి, వారిలో అవేర్‌నెస్‌ను తీసుకొచ్చేందుకే ఈ బృహత్తర కార్యక్రమాన్ని నందితా చేపట్టానంటున్నారు. అందానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సినిమా రంగంలోను బ్లాక్ బ్యూటీలకు కొదవ లేదు. కలర్‌తో సంబంధం లేకుండా నల్లకలువలు తమ టాలెంట్‌తోనే ఫిదా అనిపించుకున్నారు. పైగా ఆ బ్లాక్ కలర్‌ను తమ ప్రత్యేక అర్హతగా ముఖానికి అద్దుకున్నారు.
ఒక్క నందితానేకాదు నలుపును ఓ నేరంగా పరిగణించకుండా తాము ఎంచుకున్న రంగంలో ముఖ్యంగా సినిమా రంగంలో ముందుకు దూసుకెళ్లిన నటీమణులు చాలానే ఉన్నారు. నడుం ఒంపు నల్లగా ఉన్నా చూపించడానికి వెనుకాడ కుండా విజయాలను బ్లాక్ బ్యూటీలు సొంతం చేసుకుంటున్నారు. మరో చరిత్ర సినిమాలో షార్ట్ లెంత్ స్కర్టు లేసుకున్న సరిత తన టాలెంట్‌తో టాప్ పొజీషన్‌కు వెళ్లింది. తెల్లగా ఉన్న హీరోయిన్లను పక్కకు పెట్టి నల్లగా ఉన్న సరితకు సినిమా ఛాన్స్ లు ఇచ్చిన దర్శకులు ఉన్నారు. తెలుగునాట ఓ దశలో వాణిశ్రీ లేని సినిమా లేదు. కారు నలుపుగా ఉండే వాణిశ్రీకి ఏనాడు కలర్ అడ్డం కాలేదు.బాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన కాజోల్ బ్లాక్ బ్యూటీయే. మేకప్‌తో పని లేకుండా సహజమైన నటనతో మిల్కీ బ్యూటీలను సైతం ఓడించింది. ఇక సెక్సీ బిపాసా కలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్లాక్ బ్యూటీ అన్న పేరే తన బ్రాండ్‌గా మార్చుకుంది. టాలీవుడ్‌లోను బ్లాక్ బ్యూటీలకు కొదవ లేదు. ఆమని, ప్రియమణి, నాటి రాధ, నేటి అభిరామి ఇలా చాలా మంది నటీమణులు నల్లగా ఉన్నా విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. అప్సరసల్లాంటి అభినేత్రిలతో పోటీపడి ఢంకా బజాయించారు. ఇవన్నీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. నలుపే మెరుపని, నలుపుకూ ఓ గుర్తింపు తేవాలని నందితాదాస్ చేస్తున్న ప్రయత్నాలకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నందితా వేస్తున్న ఆ చీకటి వెలుగుల వైపు మనమూ అడుగులు వేద్దాం రండి.

No comments:
Post a Comment