హైదరాబాద్:రాష్ట్రంలో కూరగాయల ధరలు బంగారం ధరతో పోటీ పడుతూ సామాన్యుని వెక్కిరిస్తున్నాయి. రోజు రోజుకు పెరిగి పోతున్న కూరగాయల ధరలతో సామాన్యుని బ్రతుకు చిద్రమైపోతున్నది. మరో వైపు రాజకీయనాయకులు ఆడుతున్న
రాజకీయ క్రీడతో ఇప్పుడు బ్రతకడానికి తిండి కావాలా..... ఆడుకునేందుకు రాష్ట్ర విభజన కావాలా అనే ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కూరగాయాల్లో రారాజు ఎవరంటే వంకాయ అంటారు. కానీ దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతోంది. ఇటు గుంటూరు, అటు కర్నూలు మిర్చి ఘాటు లేనిదే కూరకు రుచి రాదు కానీ మిర్చిని పట్టుకుంటే ఎరుపెక్కి తినకుండానే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రకంగా ఏ కూరగాయ కొనాలన్నా కేజీ 50 నుండి 60రూపాయలు పలుకుతున్నాయి. దీంతో పావు కేజీ కూర వండుకొని అర్థాకలితో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ మిన్నుకుండి పోయింది. హోల్ సేల్ మార్కెట్ లోనే ధరలు ఇలా మండిపోతుంటే.. ఇక బయట చిల్లరకొట్టులో ధరలను చూస్తే మధ్య తరగతి బతుకులు మడతడి పోవాల్సిందే.
మరో వైపు సమైక్యాంధ్ర నిరసనల ప్రభావం కూరగాయల ధరలపై పడింది. గత నెల 30న రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంతాల్లో సమైక్య ఉద్యమం మొదలైంది. తెలంగాణ ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్యోగుల నుంచి వ్యాపారస్తుల వరకు అంతా సమైక్య ఉద్యమంలో పాల్గొని, తమ నిరసనను తెలుపుతున్నారు. దీని ప్రభావం ఎంతలా ఉందంటే.. నగరంలో కూరగాయల ధరలు గత రెండు రోజుల నుంచి సామాన్యులు కొనలేనంత తారాస్థాయికి చేరాయి.
సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌కూ ఆ ఎఫెక్ట్ బాగా తగిలింది. ముఖ్యంగా నగరానికి, సీమాంధ్ర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఏ కూరగాయల ధర చూసినా కిలో 40నుండి 60 రూపాయలకు తక్కువ లేదు. ఇక ఉల్లి ధర చూస్తే .. ఏకంగా కిలో 50 రూపాయలకు చేరింది. సామాన్యులకు కోయకుండానే కన్నీరు వస్తోంది.
నగరానికిముఖ్యంగా టమాట, ఉల్లి, మిర్చి ఎక్కువ శాతం మదనపల్లి, కర్నూలు, కోలార్ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతాయి. గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి బెండ, వంకాయ,గోరుచిక్కుడు, బీరకాయ కూరగాయ రకాలు దిగుమతి అవుతాయి. వీటితో పాటు బెంగుళూరు, బెల్గాం ప్రాంతాల నుంచి టమాట, బీన్స్, క్యాప్సికమ్ అధిక శాతం వస్తాయి. సీమాంధ్ర ప్రాంతాల్లో బంద్ ప్రభావంతో రవాణా తగ్గింది. దీనితో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. 10 లారీల ఉల్లి దిగుబడి కాస్తా..ఒకటి, రెండు లారీలకే పరిమితమైంది. మిర్చి దిగుబడి గణనీయంగా సగానికి పడిపోయింది. మిగిలిన కూరగాయలు దాదాపు సగం శాతం దిగుబడి తగ్గిపోయింది. ఇప్పటికే గోదావరి నది వరదల కారణంగా నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగి, కూరగాయ పంటలు కూడా మునిగిపోయి పంటలు నాశనమయ్యాయి. వీటికి తోడు సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో దిగుబడి తగ్గి , కూరగాయ ధరలు మరింత మండిపోతున్నాయి. దొరికిందే తరువాయంటూ..వ్యాపారులు కూడా ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. రైతు బజార్ బోర్డు నిర్ణయించిన రేటు కంటే , ఎక్కువ ధరలకు అమ్ముతూ దొరికినంత దోచుకుంటున్నారు.
కిలో కూరగాయలు కొనేకంటే , చికెన్ , గుడ్లు కొనడమే నయమని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. పేదవారు కూరగాయలు కొనలేని పరిస్థితి తయారైందని ఆందోళన చెందుతున్నారు. ఆటు వరదలు..ఇటు సమైక్య ఉద్యమ కారణంగా నగరానికి దిగుమతయ్యే కూరగాయల దిగుబడి తగ్గింది. సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే కూరల ధరలైతే తారా స్థాయికి చేరాయి. కారణమేదైనా.. ఫలితం మాత్రం సామాన్యులు,పేదలే అనుభవిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాల్సిన ప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది.

No comments:
Post a Comment