సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సింగర్స్ మాత్రమే
పాటలు పాడేవారు. కానీ ఈ ట్రెండ్ కాస్త మారుతూ వస్తోంది. సినిమాల్లో
హీరోలు నటనతో
పాటు తనలోని మరో కొత్త టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. దీనిలో
భాగంగానే మన హీరోలు సినిమాలో పాటలు పాడుతున్నారు. తమిళ హీరో
ధనుష్ 'కొలవెరీ' తో పాఫులర్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు హీరోలందరికీ
పాకుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్,నితిన్, సిద్దార్థ లు తన సినిమాలో
పాటలు పాడి అందరిని ఆకట్టుకున్నారు. ఈ మధ్య 'అత్తారింటికి దారేది'తో
టాలీవుడ్ ను ఓ ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే. ఇదే కాక మనోజ్, శింబు లు కూడా
కొత్తగా పాడిన పాటలు యూటూబ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ జాబితాలో మరో
స్టార్ హీరో వచ్చి చేరాడు. తమిళ 'సింగం' సూర్య కూడా ఓ పాట
పాడుతున్నాడు. కానీ అది సినిమాలో కాదు. ఓ యాడ్ కోసం తనలోని గాన కళను
చూపబోతున్నాడు. అయితే దేనికోసం పాడినా పాటే కాబట్టి సూర్య కూడా సింగర్
అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే హీరోలు చేసే ఎత్తుగడలన్నీ సినిమా ప్రమోషన్
లకే అని సినీ విమర్శకులు అంటున్నారు. ఎలాగు కథల్లో దమ్ము లేకున్న కనీసం
హీరో పాడిన పాటకోసమైన ప్రేక్షకులు వస్తారని దర్శకులు ఏసే జిమ్మిక్కులు.
దీనిలో భాగంగానే 'సూర్య' నటిస్తున్న ఈ యాడ్ కు పబ్లిక్ సిటి చేయడానికి
డైరెక్టర్ రాజీవ్ మీనన్ చేసిన ఎత్తుగడ అని సినీ విశ్లేషకులు
అంటున్నారు. సో సూర్య పాడిన ఈ యాడ్ కు ఎలాంటి బిజినెస్ వస్తుందో చూడాలి. 
No comments:
Post a Comment