సమంత'.. ఈ ఏడాది 'సీతమ్మ వాకిట్లో ' లాంటి సూపర్ హిట్ అందుకొని జోరుమీద ఉన్న బ్యూటీ. టాలీవుడ్ లో సక్సెస్ బ్రాండ్ గా మారిన సమంతకు
ఇప్పుడు టైం బాగుంది. ఆమె నటించిన మరో మూడు భారీ చిత్రాలు రిలీజ్ కు రెఢీ అయ్యాయి. 'పవన్ కళ్యాణ్' తో నటించిన 'అత్తారింటికి దారేది', ఎన్టీఆర్ తో చేసిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలు సెప్టెంబర్ లో తెరపైకి వస్తుండగా... ఈ డబుల్ ధమాకాకి తోడు నిర్మాణం మధ్యలో ఆగిపోయిన 'ఆటోనగర్ సూర్య' కూడా రీస్టార్ట్ అవడం ఆమెకు హ్యాట్రిక్ హ్యాపీనెస్ ను ఇస్తోంది. మూడు సినిమాల్లో ఏ రెండు సినిమాలు ఆడినా...సమంత పంట పండినట్లే. ఇవే కాక కొత్త మరో మూడు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో 'రభస', నాగ చైతన్యతో 'మనం', వి.వి.వినాయక్ కొత్త సినిమాల్లో సమంత నటిస్తోందని సమాచారం. ఇలా మూడు రిలీజ్ లు, మూడు సినిమా ప్రొడక్షన్ లతో రాకెట్ లా దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. సో ఈ సినిమాలతో సమంత టాలీవుడ్ టాప్ ఛైర్ అందుకున్నట్లే కనిపిస్తోంది.
No comments:
Post a Comment