'అంతకు ముందు.. ఆ తరువాత' చిత్రంతో మంచి హిట్ కొట్టిన నటుడు సుమంత్
అశ్విన్. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ హిట్ గా నిలిచింది. ఇంతవరకు బాగానే
ఉన్నా..
ఈ యువహీరో ప్రస్తుతం 'లవర్స్' అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ
చిత్రానికి మారుతి నిర్మాత. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' వంటి బూతు కథా
చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా.. 'రొమాన్స్' చిత్రాలకు దర్శకత్వం
వహించాడు. అయితే ఈ దర్శకుడికి ఉన్న బ్యాడ్ నేమ్ తనకూ
అంటుకుంటుందేమోనని సుమంత్ అశ్విన్ భయపడుతున్నాడు. 'లవర్స్' సినిమాకు మారుతి
కేవలం నిర్మాత మాత్రమేనని ముందుగానే తేల్చిచెప్పాడు. తన సినిమాలన్నీ
సకుటుంబంగా చూసేవిగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఆయన
చెబుతున్నాడు. మారుతి సినిమాల్లో నటిస్తే... ఇప్పటిదాకా తమకున్న కాస్త మంచి
పేరూ అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పోతుందని సుమంత్ అశ్విన్ లాంటి
హీరోల భయం. అందుకే చెడుతో తొందరగా పేరుతెచ్చుకున్నా....అది ఎప్పటికీ
చెడుగానే మిగిలిపోతుందని మారుతి ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిందని
టాలీవుడ్ విమర్శకులు అంటున్నారు.
No comments:
Post a Comment