ఓ కొత్త దర్శకుడు ఫ్లాప్ హీరో, హీరోయిన్ల తో చేసిన హిట్ సినిమా 'స్వామిరారా'. ఏ అంచనాలూ లేకుండా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో
వచ్చిన ఈ చిత్రంలో'హ్యాపిడేస్' ఫేమ్ అఖిల్ హీరోగా నటించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, టేకింగ్ తో వచ్చిన ఈ చిత్రం అటు విమర్శకులను, సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే ఓ దర్శకుడు హిట్ కొడితే తర్వాత సినిమా కోసం క్యూ కట్టే హీరోలు చాలా మందే ఉంటారు. అలాగే, సుధీర్ తో సినిమా తీస్తానని 'అల్లు అర్జున్' మాటిచ్చాడట. దీంతో తనకు పెద్ద హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీలయ్యాడు సుధీర్. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సుధీర్ కంటే ముందే కమిట్ అయ్యానని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం' ఎక్కాడు బన్ని. రేసుగుర్రం తర్వాతైనా 'బన్నీ' తనుకు అవకాశం ఇస్తాడనుకుంటే అదీ కుదిరేలా లేదు.ఎందుకంటే అంతకుముందే 'మారుతి'తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో బన్ని ని నమ్ముకున్న సుధీర్ కు నిరాశ తప్పడం లేదు. అంతే కాక సక్సెస్ వేడి కూడా చల్లారిపోయింది. దీంతో స్టార్ హీరో హ్యాండిచ్చిన విషయం చెప్పుకోలేక, కొత్త హీరోను వెతుక్కోలేక సుధీర్ వర్మ తెగ ఇబ్బంది పడుతున్నాడట. 
No comments:
Post a Comment