Thursday, August 1, 2013

మోస్ట్ 'వాంటెడ్'.. సల్మాన్

ముంబయ్తెలుగు 'పోకిరి'ని 'వాంటెడ్‌'గా రీమేక్‌ చేసిన తర్వాత సల్మాన్‌ఖాన్‌ కు కాలం కలిసొచ్చినట్లు కనబడుతోందిబాలీవుడ్‌ దర్శకనిర్మాతలకు ఈ కండల వీరుడు
'మోస్ట్ వాంటెడ్‌హీరోగా మారారుసల్మాన్ ఇప్పుడు వరస హిట్లతో రెచ్చిపోతున్నాడు. ఈ 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌కోసం అమ్మాయిలు తెగ గాలిస్తున్నారుఅయితే సల్మాన్ కనిపించడలేదని కాదు ఇంటర్‌నెట్‌లో ఈ హీరో వీడియోలు, ఇమేజ్ ల కోసం వెతుకుతున్నారు. 'వ్యూక్లిప్‌అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించిందిమొబైల్‌ ఫోన్లలో వీడియో సర్వీసులను అందించే ఈ సంస్థ ప్రతి మూడు నెలలకు ఆన్‌లైన్‌లో అత్యధికంగా వ్యూవర్స్ వెతికిన ప్రముఖుల జాబితాను విడుదల చేస్తుందిఇందులో భాగంగా భారత్‌లో రెండో త్రైమాసికంలో విడుదల చేసిన జాబితాలో సల్మాన్‌ మొదటిస్థానంలో నిలిచాడుక్రికెట్‌ గాడ్‌ సచిన్‌ను సైతం పక్కకు నెట్టిన సల్మాన్‌ ఆన్‌ లైన్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడుభారత్‌లోనే కాదు.. ఇండోనేషియాలో కూడా సల్లూ భాయ్ రెండోస్థానంలో నిలిచాడుఈ కండలవీరుడి ప్రియురాలు కత్రినా కైఫ్‌ ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. 'క్రికెట్ గాడ్సచిన్‌ మూడోస్థానంలో నిలవగా ... బాలీవుడ్‌లో సుపర్‌స్టార్‌గా ఎదుగుతున్న మరో హీరో రణబీర్‌కపూర్‌ కోసం కూడా అమ్మాయిలు తెగ నెట్‌ బ్రౌజ్‌ చేస్తున్నారని ఈ సర్వే చెప్పింది. హాలీవుడ్‌ హీరోయిన్ల కోసం వెతికే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు.. కిమ్‌ కదిర్శన్‌టేలర్‌ స్విఫ్ట్‌ వంటి హీరోయిన్లు ఈ జాబితాలో  ముందున్నారు. 'వ్యూక్లిప్‌' విడుదల చేసిన జాబితాలో దక్షణాది భామలూ ఉన్నారుహీరోయిన్లు.. అనుష్క, ప్రియమణి,కాజల్‌ అగర్వాల్‌నిత్యా మీనన్‌ వంటి వాళ్లు మొదటి పది స్థానాల్లో చోటు సంపాదించారు.

No comments:

Post a Comment