Thursday, August 22, 2013

'మసాలా' ఆడియో వాయిదా..!

         
విక్టరీ వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'మసాలా'. కొంత కాలంగా ఈ చిత్రానికి తగిన పేరు పెట్టేందుకు చిత్ర యూనిట్ నానా అవస్థలు పడింది. ఇప్పుడు అది కుదరగానే.. ఆడియో విడుదలకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఈ నెల 23న ఆడియో విడుదల కావాల్సి ఉంది. అయితే.. అకస్మాత్తుగా ఆడియో విడుదల వాయిదా పడినట్టు హీరో రామ్ తన 'ట్విట్టర్' ద్వారా పోస్ట్ చేశాడు. కారణాలు మాత్రం చెప్పకపోయినా.. వాయిదా పడ్డందుకు క్షమాపణలు మాత్రం చెప్పాడు. ఈ మూవీ ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నాడు. హిందీలో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో వచ్చిన 'బోల్ బచ్చన్' చిత్రాన్ని.. తెలుగులో 'మసాలా' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా.. 'స్రవంతి మూవీస్ సంస్థ' తెరకెక్కిస్తోంది. హీరోయిన్లుగా 'అంజలి', 'షాజన్ పదమ్ సీ' నటిస్తున్నారు.  ప్రస్తుతం.. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగా.. స్టార్ హీరో నుంచి 'మల్టీస్టార్' కు మారిన హీరో 'విక్టరీ' వెంకటేష్, హీరో రామ్ లకు కొద్ది కాలంగా హిట్ లేవు. దీంతో ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఇద్దరి అభిమానులు కూడా ఆలస్యంపై నిరాశ చెందుతున్నారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకి 'మసాలా' ఘాటు చూపించాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు రామ్ ట్విట్టర్ లో శపథం చేశాడు. మరి.. ఎంతవరకూ ఇది నెరవేరుతుందో చూడాలి.

No comments:

Post a Comment