- tive tab)
హైదరాబాద్: యాపిల్‌ను ఢీకొట్టడానికి గూగుల్ తన ఉత్పత్తులను మార్కెట్‌లో విరివిగా విడుదల చేస్తోంది. దీనిలో భాగంగా మెరుగైన సదుపాయాలున్న 'నెక్సెస్ 7'ను విడుదల చేసింది. 'ఐప్యాడ్ మినీ'కి పోటీగా నెక్సెస్ 7 సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. మొబైల్ కంప్యూటింగ్ విభాగంలో యాపిల్, అమెజాన్ డాట్ కామ్‌లలో పోటీ పడుతుంది. గత వారం నుంచి సరికొత్త వెర్షన్ నెక్సెస్‌ను అమెరికాలోని స్టోర్లలో అమ్మకాలు ప్రారంభించిన గూగుల్ ... ఆన్‌లైన్‌లో ఈ వారం నుంచి ఆర్డర్లు తీసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాబ్‌లతో పోల్చితే ప్రోసెసర్ డబుల్ స్పీడ్ ఉంటుందన్న గూగుల్.. డ్యూయెల్ స్పీకర్లను అమర్చింది. దీంతో క్వాలిటీతో పాటు సౌండ్ లెవల్ కూడా పెరగనుంది. 10 నుంచి 11 గంటల వరకు నెట్ బ్రౌజింగ్‌కు అనుకూలంగా బాటరీ సపోర్టు చేస్తుంది..
ధరలోనూ పోటీ...
యాపిల్ ఐప్యాడ్ మినీ మార్కెట్‌లో 339 డాలర్లకు అమ్ముడవుతుండగా... గూగుల్ 16 జీబీ స్టోరేజ్ ఉండే నెక్సెస్‌ను 229, 32 జీబీ వెర్షన్ 269 డాలర్లకే విక్రయిస్తుంది. ఇదే విభాగంలో మరోపోటీ సంస్థ అమెజాన్ డాట్ కామ్ తన ప్రొడక్ట్ ను 199 డాలర్లకే విక్రయిస్తుంది. గత ఏడాది గూగుల్.. నెక్సెస్ వంటివి మార్కెట్‌లో అడుగుపెట్టడంతో... యాపిల్ 10 ఇన్‌చ్ ఐప్యాడ్‌ల అమ్మకాలు తగ్గకుండా ఉండేందుకు 8 ఇన్ చ్ ల డిస్‌ప్లేతో మినీని మార్కెట్ లో విడుదల చేసింది. యాపిల్‌కు పోటీగా మరిన్ని ఫీచర్స్ తో ఇప్పుడు విడుదల చేసిన నెక్సెస్ ఆకట్టుకుంటుందని నిర్వహకులు అంటున్నారు. మినీ ఐప్యాడ్‌తో పోల్చితే రిజల్యూషన్ సహా అన్ని టెక్నికల్ అంశాల్లో గూగుల్ మెరుగ్గా ఉంటుందన్నారు. యాపిల్‌తో పోల్చితే గూగుల్ నెక్సెస్‌కు మార్కెట్‌లో పాపులారిటీ లేకపోయినా.. 70 మిలియన్ల యాండ్రాయిడ్ టాబ్‌లలో 10 పర్సెంట్ మార్కెట్ షేర్ ఉందని.. ఇప్పుడు ఇది మరింత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ 2013 తొలి ఆరు నెలల్లో 34 మిలియన్ ఐప్యాడ్స్ విక్రయించింది. ఇదే విభాగంలో మొదటి మూడు నెలల్లో అమెజాన్1.8 మిలియన్ విక్రయాలు జరిపింది.
టివి స్ట్రీమింగ్ లోకి గూగుల్...
టాబ్ మార్కెట్‌లో భారీ పెట్టబడులతో జూదమాడుతున్న గూగుల్... టీవీ స్ట్రీమింగ్ డివైస్‌లలో కూడా పోటీకి సై అంటోంది. మార్కెట్‌లో 56శాతం వాటాతో ముందున్న యాపిల్‌కు పోటీగా ఇప్పుడు గూగుల్ క్రోమ్‌కాస్ట్ పేరుతో స్టిక్‌ను విడుదల చేసింది. ప్రజలకు టీవీ ఆధారిత ఇంటన్‌నెట్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమంటున్న గూగుల్ కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లకు వల వేస్తోంది. పెన్ డ్రైవ్ సైజులో ఉండే ఈ డివైస్‌ను టీవీలోని హెచ్‌డిఎంఐ పోర్టుకు అనుసంధానం చేయవచ్చు. ఇది నెట్ ఫ్లిక్స్ తో పాటు.. గూగుల్, యూట్యాబ్, ఇతర నెట్ కంటెంట్‌ను అందిస్తుంది. గూగుల్‌లో డివైస్‌ను టాబ్‌లు... పర్సనల్ కంప్యూటర్...స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానం చేయడానికి వీలుగా రూపొందించారు. పోటీ కంపెనీల ఉత్పత్తులు కేవలం స్టాండర్డ్ గా రిమోట్ కంట్రోల్డ్ కంటెంట్ ఆధారితంగా పనిచేస్తాయి. ఇది గూగుల్ అమ్మకాలు పెరగడానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా ధర కూడా తక్కువగా ఉండడం కలిసివచ్చే అంశం. మార్కెట్‌ను దక్కించుకోవడానికి గూగుల్ .. ధరల యుద్దానికి కూడా దిగింది. యాపిల్ డివైస్ 99డాలర్లకు అమ్ముతుంటే... గూగుల్ 35 డాలర్లకు విక్రయిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కూడా తన స్టిక్‌ను 100 డాలర్లకు అమ్ముతుంది. 2013లో మొదటి మూడు నెలల్లో యాపిల్ టీవీని 13 మిలియన్ యూనిట్లు అమ్మగా...రోకు అనే సంస్థ 21.5శాతం వాటాతో 5 మిలియన్ యూనిట్లకు అమ్మింది.
మొత్తం మీద రెండు అమెరికన్ కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. గాడ్జెట్స్ లో ప్రీమియం బ్రాండ్‌గా అమ్మకాలతో రికార్డులు సృష్టిస్తూ గ్లోబల్ లీడర్‌గా ఉన్న యాపిల్‌తో ఇంటర్‌నెట్ కంపెనీ గూగుల్ యుద్ధం ప్రకటించింది. అమెరికన్ల మనసును దోచుకున్న యాపిల్ ఉత్పత్తులను తట్టుకుని గూగుల్ నిలబడగలుగుతుందా? కాలమే సమధానం చెప్పాలి.

No comments:
Post a Comment