పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కనిపించడం లేదని.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని టాలీవుడ్ టాక్. సమైక్యాంధ్ర సెగలతో ఈయన
నటించిన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' వరుసగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో సదరు నిర్మాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, అయితే ఈ విషయంపై పవన్ మాత్రం మౌనంగా ఉండిపోయాడని సమాచారం. పవన్ కు ఉన్న ఇమేజ్ తో సినిమాకు సంబంధించి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే కొంత లాభంగా ఉండేదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కొంత సామాజిక అవగాహన ఉన్న 'పవన్' ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో తెలియడం లేదు. ఈ క్రమంలో తాను బయట ఉండడమే మంచిదని భావించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం పవన్ బెంగుళూరులో ఉన్నాడనేది కొందరి వాదన. ఇదిలా ఉంటే 'అత్తగారింటికి దారేది' సినిమా మాత్రం 'పవన్' బర్త్ డే రోజున విడుదలవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment