Wednesday, August 28, 2013

మార్కెట్ లోకి రానున్న 'డ్రైవర్ లేని కార్లు'

మీరెప్పుడైనా డ్రైవర్ లేని కారులో ప్రయాణం చేశారా? అదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా.. అదే మరి గూగుల్‌ స్పెషాలిటి..
గూగుల్ సంస్థ త్వరలో డ్రైవర్‌ లేని కార్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇవి మార్కెట్ లోకి వస్తే.. డ్రైవర్ అవసరం లేకుండానే కారులో షికార్లు చేయొచ్చు. అంతేకాదు ఈ కార్లు వాడటం ద్వారా ప్రమాదాల సంఖ్యనూ తగ్గించవచ్చు. అలాగే.. ప్రయాణ సమయం తగ్గడం, ట్రాఫిక్ జాంల నివారణ, టెన్షన్ లేని ప్రయాణం తదితర లాభాలున్నాయి. 2017 నాటికి ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ పరుగులు తీస్తోంది. గూగుల్‌ కేవలం డ్రైవర్‌లెస్‌ కార్లను తయారు చేయడం మాత్రమే కాదు, వాటిని అతి తక్కువ ధరకే తయారు చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. మరి ఆ కారు తీరేంటి చూసొద్దాం రండి...
2010లోనే రూపకల్పన...
 
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 2010లోనే రూపకల్పన చేసింది. గూగుల్ టెక్నాలజీని టొయాట ప్రియస్‌, లెక్సస్‌ ఆరెక్స్‌ కార్లలో అమర్చి దీనిని రూపొందించింది. ఆ కార్లలో కెమెరాలతో పాటు సెన్సర్లను, రాడార్లను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. యాక్సిడెంట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించే ఈ కార్ల ఉత్పత్తిలో గూగుల్ ముందుంది. అయినప్పటికీ వివిధ కార్ల కంపెనీలు గూగుల్‌తో భాగస్వామ్యానికి అంత సుముఖంగా లేవు. దీంతో ఈ ప్రాజెక్టు నత్తనడకన నడిచింది. దీంతో విసుగు చెందిన గూగుల్‌ స్వయంగా తానే కార్లను తయారు చేయాలని నిర్ణయించుకుంది. డ్రైవర్‌లెస్‌ టెక్నాలజీతో పాటు... కార్ల ఉత్పత్తి రంగంలోకి కూడా గూగుల్‌ ప్రవేశించింది. అంతేకాక ఇది రోబో ట్యాక్సీలనూ తయారు చేస్తోంది. ఆ తర్వాత వీటిని పరీక్షించడానికి బ్రిటన్‌ అనుమతిని కోరింది. ఆ దేశం అనుమతి ఇవ్వడంతో రోడ్లపై పరీక్షలు కూడా మొదలు పెట్టింది. దీంతోఈ కార్లు ఈ ఏడాది ఆఖరిలోపు మార్కెట్లోకి రానున్నాయి. డ్రైవర్‌ ఉండని ఈ ట్యాక్సీలు వస్తే డ్రైవింగ్‌ టెన్షన్‌ తగ్గిపోతుంది.
అమెరికాలో ఆసక్తి...
డ్రైవర్‌లేని కార్లపై ఇప్పుడు అమెరికాలో సైతం ఆసక్తి నెలకొంది. అంతేకాదు..దాదాపు తొమ్మిది రాష్ట్రాల చట్టసభల్లో వీటిపై చర్చ నడిచింది.

1 comment: