'రామ్ చరణ్'.. మెగాస్టార్ కు వారసుడిగా వచ్చిన చిరుత. అయితే రెండో సినిమాతోనే తండ్రి పేరు నిలబెట్టే మగధీరుడనని నిరూపించుకున్నాడు. ఇక 'రచ్చ', 'నాయక్' సినిమాలు హిట్ అవడంతో చిరుకు సరైన వారసుడినని చూపించాడు. అయితే పది సినిమాల కెరీర్ కూడా లేని చరణ్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా పూర్తి చేశాడు. ఇప్పట్లో ఏ టాలీవుడ్ హీరోకు సాధ్యం కాని రేంజ్ లో గ్రాండ్ గా బాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. మరోవైపు ఇప్పుడున్న మార్కెట్లో ఏ హీరో అయినా ప్రయోగాలు చేయడం రిస్క్ తో కూడుకొన్న పని. కానీ తుఫాన్ ఆడియోలో చరణ్ మాత్రం తాను 'జంజీర్' సినిమాతో బాలీవుడ్ ప్రయోగం చేశానని చెప్పడం మెగా అభిమానులను నిరాశకు గురిచేసిందట. బాలీవుద్ ఎంట్రీ అభిమానులకు ఇష్టంలేదని సమాచారం. ఇదేకాక 'తుఫాన్' పాటలపై అసంతృప్తితో ఉన్నారని టాలీవుడ్ టాక్.
ఇక తన బాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ తో కలెక్షన్ల సునామీ లేకపోయినా, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని చరణ్ ఇలా మాట్లాడాడని కొందరు సినీ విమర్శకులు అంటున్నారు. టాలీవుడ్ లో తన బాబాయ్ తో పోటీపడి.. తప్పుకొని చివరికి.. అతని కంటే ముందే బాలీవుడ్ లోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ 'తుఫాన్' కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా..? లేదా..?అనేది వేచి చూడాలి.

No comments:
Post a Comment