Thursday, August 1, 2013

స్నోడెన్ కు రష్యా ఆశ్రయం

రష్యా : అమెరికా సైబర్ గూఢచర్యం రహస్యాలను వెల్లడించి చిక్కుల్లో పడి.. ఇన్నాళ్లూ మాస్కో విమానాశ్రయానికే పరిమితమైన స్నోడెన్.. 
మొత్తానికి బయటికి రాగలిగాడు. ఇతనికి ఎట్టకేలకు రష్యా ఆశ్రయం లభించింది. విమానాశ్రయం నుండి బయటకు వచ్చిన స్నోడెన్ వెంటనే రష్యాలోని ఓ సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే అతని భద్రత దృష్ట్యా.. ఎక్కడ నివాసం ఉండేది వెల్లడించబోమని అధికారులు తెలిపారు. స్నోడెన్ కారణంగా అమెరికాతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నా.. రష్యా మాత్రం ఆయనకు ఆశ్రయమిస్తున్నట్లు ప్రకటించి ధైర్యాన్ని ప్రదర్శించింది. దీంతో స్నోడెన్ ను పట్టుకోవాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అమెరికా ఆశ నిరాశగానే మిగిలిపోయింది. స్నోడెన్ కు ఆశ్రయం కల్పించలేమని భారత్ ప్రకటించినా.. వెనెజులా లాంటి చిన్న దేశం మాత్రం అమెరికా పెత్తనానికి తలొగ్గకుండా అతనికి ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.


No comments:

Post a Comment