'ఆమె నటన వల్లే సినిమాకు ఇంత పేరు'

'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' సినిమా విజయవంతంగా నడుస్తోందని, హీరోయిన్ 'హరిప్రియ' నటనవల్లే సినిమాకు ఇంత పేరు వచ్చిందని హీరో 'వరుణ్ సందేశ్' పేర్కొన్నాడు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు వరుణ్ సందేశ్ కృతజ్ఞతలు తెలిపాడు. 'వరుణ్ సందేశ్' హీరోగా, కోనేటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్'. ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ఆదివారం విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. '' నేను చేసిన చిత్రాల్లో ఇది ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అన్నింటి కంటే భిన్నంగా, కొంచెం తేడాగా ఉంటుంది. 'హరిప్రియ' బాగా నటించింది. నిజానికే ఆమె నటన వల్లే ఈ సినిమాకు ఇంత పేరు వచ్చింది. దర్శకుడు డైలాగ్ లు బాగా ఇచ్చాడు. సినిమా బాగా వచ్చింది, అందరికి కృతజ్ఞతలు.'' అని అన్నాడు. హీరోయిన్ హరిప్రియ మాట్లాడుతూ..'' చిత్రంలో నిజమైన హీరో అందరు నన్నే అంటున్నారు. కానీ అసలు హీరో వరుణ్ సందేశ్. దీనిలో నా పాత్ర ఎక్కువ ప్రాధాన్యత కల్గి ఉంది. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ కే వెళ్తుంది.'' అన్నారు. దర్శకుడు శ్రీను మాట్లాడుతూ.. అందరినీ మెప్పించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాను. సినిమాకు థియెటర్ లలో మంచి స్పందన వస్తోంది''. అన్నారు.
No comments:
Post a Comment