Thursday, August 1, 2013

మూకుమ్మడి రాజీనామాలు ?

హైదరాబాద్ :రాష్ట్ర విభజన ప్రకటించినప్పటి నుండి సీమాంధ్ర నేతలు గుర్రుగా ఉన్నారు. వీరంతా మూకుముమ్మడిగా రాజీనామాలు చేయాలని నేతలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం మినిస్టర్ క్వార్టర్స్ లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. సాయంత్రం ఏడు గంటలకు సిఎం కిరణ కుమార్ రెడ్డి తో వీరు భేటి కానున్నట్లు తెలిసింది. ఈ భేటిలో ముఖ్యమంత్రికి రాజీనామా లేఖలు సమర్పిస్తారని తెలుస్తోంది. రాజీనామాలు చేస్తే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని కొందరు నేతలు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత సీమాంధ్రలో నిరసన సెగలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతానికి చెందిన నేతలందరూ రాజీనామాలు చేయాలని ఆ ప్రాంత వాసులు వత్తిడి తెస్తున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలితంగా ప్రకటించాలని..ఇరు ప్రాంతాలకు హైదరాబాద్ ను రాజధానిగా ప్రకటించాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది నేతలు సమైక్య రాష్ట్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు రాజీనామా చేస్తారా లేదా అన్నది కొద్దిసేపట్లో తేలిపోనుంది.

No comments:

Post a Comment