Thursday, August 1, 2013

సిక్స్ ప్యాక్ 'లేడీ'

దేశంలోనే తొలి 'సిక్స్ ప్యాక్' సాధించిన మహిళ 'కిరణ్ టెంబ్లా' చెప్పిన విశేషాలు..
''సిక్స్ ప్యాక్ సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రెండో సారి గర్భిణీగా ఉన్నప్పుడు 74 కిలోల బరువు పెరిగాను. బరువు తగ్గించుకుందామని
 'లక్ష్మణ్'దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. కేవలం ఫిట్ నెస్ కోసమే జిమ్ కు వెళ్లడం జరిగింది. తరువాత ఎదైనా సాధించాలనే తపన నాలో బయలుదేరింది. బాడీ బిల్డింగ్ కోసం కఠోర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయంలో నా  భర్త నన్ను సమర్థించారు. ఏడు నెలల తరువాత 'సిక్స్ ప్యాక్' సాధించాను. ఆ సమయంలో జాతీయ బాడీ బిల్డింగ్ లో పాల్గొనాలని నాకు ఆహ్వానం అందింది. కానీ నిబంధనలు అంగీకరించడం అంత సులువు కాదు. నాకిప్పుడు 40 ఏళ్లు. సిక్స్ ప్యాక్ సాధించినందుకు నాకు బంధువులు, స్నేహితులు, పలువురు విదేశీయులు అభినందనలు తెలిపారు. 2008 సంవత్సరంలో పర్సనల్ జిమ్ ను ప్రారంభించా. ప్రస్తుతం అనేక మంది సెలబ్రిటీలకు శిక్షణనిస్తున్నాను.''
ఇంటి పనుల్లో భర్తలు హెల్ప్ చేయాలి.
    
భార్య, భర్తలు ఒకరికొకరు సహకారం తీసుకుంటే ఇంటిలో సంతోష వాతావరణం ఉంటుంది. ఇంటి పనుల్లో భర్తలు తమకు సహాయం చేస్తారని పలువురు గృహిణిలు పేర్కొన్నారు. అత్తగారి కుటుంబం ప్రోత్సాహం వల్ల తాను ఉన్నత చదువును పూర్తి చేశానని ఓ గృహిణి తెలిపింది. వంట పనుల్లో హెల్ప్ చేయకపోయినా ఇతర పనుల్లో హెల్ప్ చేస్తుంటారు. ఇంటి పనుల్లో ఇల్లాలికి భర్త లు హెల్ప్ చేస్తే బాగుంటుందని గృహిణిలు అభిప్రాయపడ్డారు.
'వేధింపులపై' నిలదీయాలి..
     ఉద్యోగం చేస్తున్న ఎంతో మంది మహిళలు 'లైంగిక వేధింపులకు' గురవుతున్నారు. దీనిపై మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై 'పూర్ణిమా నాగరాజ్, (మానసికవైద్య నిపుణురాలు) అభిప్రాయాలు..
''కార్యాలయాల్లో సంతోష వాతావరణం ఉంటుంది. స్త్రీ, పురుషులు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దీనిని కొంతమంది అలుసుగా తీసుకుని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఉన్నత పదవులు నిర్వహిస్తున్న కొంతమంది స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. ఈ పరిస్థితులు ఎక్కువగా రాత్రి వేళ పనిచేసే వారు ఎదుర్కొంటుంటారు. ఐటి రంగంలో, గ్రేవియార్డు షిప్ట్ లో పనిచేసే వారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. స్త్రీలను తాకడం, అసభ్యకరంగా ఫోటోలు తీయడం, వెటకారంగా మాట్లాడడం, డబుల్ మీనింగ్ లో వ్యాఖ్యలు చేయడం, వల్గర్ మేసేజ్ లు పంపడం ఇలాంటివి కొన్ని లైగింక వేధింపుల కిందకు వస్తాయి. వేధింపులకు గురైన మహిళలు బయటకు చెప్పకపోవడం..సమాజం ఏమనుకుంటుందోనని ఆలోచిస్తారు. దీనితో వేధింపులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటువంటి వాటిని నిరోధించాలి. వేధింపులు ఎక్కువగా ఉంటే ఉద్యోగం మార్చుకుంటే బెటర్. కార్యాలయాల్లో ఇలాంటి పరిస్ధితులు ఎదురైనప్పుడు వెంటనే పై అధికారులకు చెప్పాలి. వాళ్ళు స్పందించకపోతే హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ వారికి ఫిర్యాదు చేయాలి.వారు కూడా పై వారితో కుమ్మక్కై ఉంటే పోలీసు, న్యాయశాఖను సంప్రదించాలి''.

No comments:

Post a Comment