తెలంగాణ కోసం ప్రత్యేక
ఉద్యమాలు.. నిరసనల హోరు.. విభజన వాదంతో రాష్ట్రం రావణ కాష్టంలా
రగిలిపోయింది. అయినప్పటికీ రాజకీయ నేతలు
విభజన అంశంపై తమ
చిత్తశుద్దిని ఏనాడూ ప్రదర్శించలేదు. రాజకీయ లబ్ధికోసం వ్యూహాలు చేస్తూ
వచ్చారు. రాష్ట్రం లో ప్రాంతాల మధ్య అపోహలు, అసమానతలు తొలగించడానికి
ఎప్పటికప్పుడు ఒప్పందాలు, జీవోలతో సరిపుచ్చారు. ఇప్పుడు
రానున్న 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ మనుగడే ప్రశ్నార్థకం
అవుతుందని తెలుసుకున్న అధినాయకులు 'ప్రత్యేక వాదాన్ని' ముందుకు
తెచ్చారు. అవినీతి, కుంభకోణాలతో నిండా మునిగిపోయిన యుపిఎ సర్కార్ తెలంగాణ
వాదంతో ఓట్లు దండుకోవాలని చూస్తోంది. ప్రజాసమస్యలను తుంగలో తొక్కి తమ
రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాష్ట్రంలో వైషమ్యాలను పెంచుతోంది. గతంలో భాషా
ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామంటూ 'తెలంగాణ'పై
నేతలు ఆసక్తి చూపలేదు. వీటన్నింటిపై సమగ్రంగా ఎందుకు అమలు చేయడం లేదని
తెలంగాణ నాయకులు పాలకులను ఎప్పుడూ నిలదీయలేదు. అమలు చేయకపోతే ఇబ్బందులు
తప్పవని తెలిసినా పాలకులు పట్టించుకోలేదు. చేసుకున్న ఒప్పందాల
ప్రకారం, వచ్చిన జీవోలు అమలు కాకపోతే ప్రత్యేక వాదం పెరుగుతుందని తెలిసి
కూడా సమైక్య వాదులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మొత్తంగా రాజకీయ నాయకులు
తమ స్వార్థం కోసం 'విభజన'ను వాడుకున్నారు. దాని ఫలితమే
నేటి 'తెలంగాణ' ప్రత్యేక రాష్ట్రం.
జీవోలతో సరి.. అమలు మాత్రం జీరో...
1956 నుంచి తెలంగాణ అంశాన్ని పాలకులు నాన్చుతూనే ఉన్నారు. తరచూ తెరపైకి వస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. తదనంతరం చేసిన ముల్కీ నిబంధనలు సరిగా అమలు కావడం లేదంటూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. ముల్కీ నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. కానీ సుప్రీంకోర్టు 1972 నాటి తీర్పులో ఈ నిబంధనలను సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పును నీరుకారుస్తూ పార్లమెంటు చట్టం చేసింది. దీంతో ముల్కీ నిబంధనల స్థానే స్థానికుల హక్కుల్ని పరిరక్షించేందుకు సిక్స్ పాయింట్ ఫార్ములాను ప్రవేశపెట్టారు. విద్యాసంస్థల్లో, ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్న నిబంధనలు వచ్చాయి. అయితే, ఈ పార్ములా కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ ఉల్లంఘనలను సరిచేసేందుకు ఆనాటి ప్రభుత్వం జివో 610ను తెచ్చింది. జివో మాత్రం వచ్చింది. కానీ, అది కూడా అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో జై ఆంధ్ర వాదన ముందుకు వచ్చింది. రాజధానిలో ఉద్యోగం చేసుకునే హక్కు కూడా లేదా అంటూ ఆంధ్ర ప్రాంతం వారిలో అందోళన మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం వారు ఉద్యమించారు. రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితుల కారణంగా 11 నెలల రాష్ట్రపతి పాలన విధించారు. 1973లో తిరిగి ఎన్నికలు జరిగాయి. ఐదేళ్ల గడవకముందే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి వచ్చారు.
ఉల్లంఘనలు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గిర్ గ్లానీ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2004లోనే నివేదికను సమర్పించింది. మళ్లీ దానిపై శాసన సభా సంఘం కమిటీలకు, సమీక్షలు మొదలైనాయి.రాజకీయ చిత్తశుద్ది లేకపోవడంతో అది కూడా అమలుకు నోచుకోలేదు.
ఈ వివాదాలు చల్లారకముందే చాలదన్నట్లు హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ మరో వివాదం మొదలైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ నిబంధనను ఇందుకు ఉదాహరణగా తీసుకువచ్చారు. చివరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని తొలగించింది. దీంతో ఫ్రీ జోన్ వివాదం ముగిసింది. ఈ ఐదు దశాబ్దాల్లో దీనిపై శ్రద్ధ కనబరిచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజకీయ లబ్ధికోసమే...
పెద్దమనుషుల ఒప్పందం నుంచి 610 జివో దాక అమలు చేయాలని ఇటు తెలంగాణ వాదులు ప్రత్యేకంగా పోరాడిన సందర్భాలు లేవు. కేవలం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆందోళన చేశారు. అదే సమయంలో అమలు కాకపోతే భవిష్యత్తులో విభజన అంశం మరోసారి తెరమీదకు వస్తుందని తెలిసినా సమైక్య నేతలు పట్టించుకోలేదు. రెండు ప్రాంతాల నేతలు జివో, ఒప్పందాల అమలుకు కృషి చేసి ఉంటే ఇప్పుడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

No comments:
Post a Comment