Tuesday, July 30, 2013

క్రిస్పీ-టేస్టీ మసాలా సాంబార్ వడ్ -బ్రేక్ ఫాస్ట్ రిసిపి

సాంబార్ వడ సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి. దీన్ని చట్నీ లేదా సాంబార్ తో బ్రేక్ ఫాస్ట్ గా తిని ఎంజాయ్ చేస్తుంటారు . ఈ వడ చాలా క్రిస్పీగా మరియు అద్భుతమైన రుచితో ఉంటుంది. ఈ క్రిస్పీ మసాలా వడను సాంబార్ లో
డిప్ చేయవచ్చు లేదా కోకనట్ చట్నితో తినవచ్చు. లేదా రెండింటి కాంబినేషన్ లో కూడా తినవచ్చు.
మీరు రెగ్యులర్ సాంబార్ వడను కొంచెం డిఫరెంట్ గా, తయారు చేసుకోవాలంటే వీటికి కొంచెం మసాలా జోడించడమే. మసాల సాంబార్ వడను కొన్ని ఆరోమాటిక్ మసాలా దినుసులతో తయారు చేస్తారు. వాటిలో ముఖ్యంగా మిరియాలు మరియు ఉల్లిపాయముక్కలు జోడించి తయారు చేస్తారు. మరి మసాలా సాంబార్ వడ తయారు చేయు విధానం అందుకు అవసరం అయ్యే వస్తువులేంటో ఒకసారి చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
ఉద్దిపప్పు: 2 cups
ఉల్లిపాయలు: 2 (inely కత్తిరించి)
బ్లాక్ మిరియాలు: ½ tsp
కారం: 1tsp
కరివేపాకులు: 3 -4(సన్నగా చిన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర: 1tbsp (చిన్న ముక్కలుగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
చమురు 1 కప్
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉద్దిపప్పును 3-4గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అప్పడే వడ చాలా సాఫ్ట్ గా వస్తుంది.
2. పప్పు బాగా నానిన తర్వాత, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని, ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. తర్వాత అధనపు నీరు ఉన్నట్లైతే తొలగించడానికి సులభం అవుతుంది.
3. ఒక బౌల్లో ఉప్పు, బ్లాక్ పెప్పర్, ఉల్లిపాయముక్కలు, కారం, కరివేపాకు మరియు కొత్తమీర ఆకులు, గ్రైండ్ చేసి పెట్టుకొన్న ఉద్దిపప్పు పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి బాగా కాగనివ్వాలి.
5. నూనె కాగిన తర్వాత చేతులను తడి చేసుకొని, పిండి మిశ్రమాన్ని అరచేతిలో పెట్టుకొని వడలా తట్టుకోవాలి. మద్యలో వేళితో చిన్న రంద్రాన్ని చేయాలి.
6. ఇప్పుడు వీటిని కాగే నూనెలో వేసి మంటను మీడియంగా పెట్టి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ లో ఉడికినతర్వాత వాటిని సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. అంతే మసాలా సాంబార్ వడ రెడీ. వీటిని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి.

No comments:

Post a Comment