Tuesday, July 30, 2013

వేగంగా బరువు తగ్గించుకోవడానికి పది సీక్రెట్స్ ..!

ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవిన శైలితో పాటు అలవాట్లు ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభాన్ని చూపెడుతున్నాయి. ప్రస్తుత కాలంలో అధికంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం. చాలా మంది ఈ సమస్యకు వివిధ రకాల
ప్రయత్రాలు మరయు డైటింగ్ చిట్కాలు పాటించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకు మరింత స్మార్ట్ గా పనిచేయాలి. ఉడికించిన ఆహారం తీసుకోవడానికి బదులు కొద్దిగా చురుకుగా పనిచేయాలి. చురుకుగా పనిచేయాలంటే వర్క్ ఔట్స్ చేయాలని కాదు. మీరు తీసుకొనే చురుకైన పద్దతులే మిమ్మల్ని కొన్ని పౌండ్ల బరువును తగ్గడానికి సహాయపడుతాయి. అయితే మనం బరువు తగ్గడానికి కొన్నిసీక్రెట్ ఫుడ్స్ ఉన్నాయి.
మన వంటగదిలో మనం ప్రతి నిత్యం ఉపయోగించి కొన్ని వస్తువులో మన బరువును తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. వెల్లుల్లి మరియు బెల్ పెప్పర్ కూడా బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అయితే బరువు తగ్గడానికి ఇటువంటి సాధారణ ఆహారాలు కాకుండా కొన్ని సీక్రెట్ ఆయుధాలను ఉపయోగించాలి. అవి అంత పాపులర్ ఫుడ్స్ కాకపోయినప్పటికీ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడే ఆహారాలే..
ఉదాహరణకు, పుట్టగొడుగులు బరువు తగ్గిస్తాయన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. మష్రుమ్ (పుట్టగొడుగులు)లో కాలోరీలు తక్కువ మరియు శరీరానికి సరిపడా పోషకాంశాలుగా మార్చే విటమిన్స్ ఎక్కువ. మరి మీరు వెయిట్ లాస్ డైట్ లో ఉన్నట్లైతే మీ ఆకలిని చంపి, బరువు తగ్గించే ఈ మష్రుమ్ లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడమే. కాబట్టి, మీకు ఉన్న ఆకలిని కంట్రోల్ చేయాలంటే హాఫ్ ఫ్రైయిడ్ లేదా వేగించిన పుట్టగొడుగులను తీసుకోవడం మంచి పద్ధతి. అదే విధంగా, ఎగ్ వైట్(గుడ్డులోని తెల్లని భాగం)కూడా క్యాలరీలన్ కరిగించడానికి బాగా సహాయపడుతుంది. ఇది వ్యాయామం తర్వాత తీసుకొనే ఒక మంచి ఆహారం. మరియు శరీరానికి నిరోధక వ్యవస్థను పెంచడానికి మరియు కొవ్వు నిల్వలను కరిగించడానికి బాగా సహాపడుతుంది. సాధారణంగా మనం ఆహారం రుచిగా ఉందని గుడ్లను ఎక్కువగా తిని ఎంజాయ్ చేస్తుంటారు, అయితే ఇందులో అనేకమైన ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. అందువల్ల గుడ్డు కూడా బరువు తగ్గించడంలో ఒక రహస్య ఆయుధంగానే అభివర్ణించాలి.
కాబట్టి, బరువు తగ్గించడానికి అటువంటి సీక్రెట్ ఆయుధాలు(బరువు తగ్గించే ఆహారాలు)మరికొన్ని ఉన్నాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ గా తింటూనే తప్పకుండా కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల కొన్ని పౌండ్ల బరువును మీరు కోల్పోవచ్చు. మరి ఆ సీక్రెట్ వెయిట్ లాస్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మష్రుమ్(పుట్టగొడుగులు): వేగంగా బరువు తగ్గించే ఆహారాల్లో మష్రుమ్ ఒక మంచి ఆహారం. మాంసాహార నిర్మాణం కలిగిన ఈ మష్రుమ్ శాకాహారంగా ఉంది. మష్రుమ్ లో తక్కు కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉండటం చేత మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఒక మంచి మార్గం.

No comments:

Post a Comment