హైదరాబాద్ : మెదక్ ఎంపి విజయశాంతిపై వేటు పడింది. పార్టీ
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అభియోగంతో టిఆర్ఎస్ పార్టీ
విజయశాంతిని
సస్పెండ్ చేసింది. ఇప్పటికే అనేక సార్లు ఆమెను క్షమించామని..
పొలిట్ బ్యూరో నిర్ణయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టిఆర్ఎస్ అధినేత
కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు విజయశాంతికి టీఆర్ఎస్ నోటీసులు
ఇవ్వనున్నట్లు సమాచారం. ఆమె గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
'రాష్ట్ర విభజన' ప్రకటన చేసినప్పుడు కూడా ఆమె పార్టీ నాయకులతో కలవలేదు. ఈ
నేపథ్యంలో ఆమెపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఓ వైపు విజయశాంతి కాంగ్రెస్ లో
కలవనున్నట్లు వార్తలు వస్తుంటే.. మరో వైపు ఆమె బిజెపిలో కి వస్తే తగిన
స్థానం కలిపిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే మంగళవారం మీడియాతో
మాట్లాడిన విజయశాంతి మాత్రం తాను ఏ పార్టీలో చేరుతుందో స్పష్టం చేయలేదు.
No comments:
Post a Comment