Tuesday, July 30, 2013

హైదరాబాద్: కేంద్రం, రాష్ట్ర విభజన పై ఓ నిర్ణయం తీసుకుంటుందన్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు
బలగాలు సంసిద్ధమయ్యాయి. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలు గస్తీ కాస్తున్నాయి. విఐపిలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు.దీంతో ఎప్పుడు ఉద్యమం ఎగసి పడినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రానికి వెయ్యి పారామిలటరీ బలగాలను కేంద్రం తరలించింది.
పారామిలటరీ వివరాలు
 
ఒక్కొక్క పారామిలటరీ కంపెనీల్లో దాదాపు 250మంది ఉంటారు. ఇందులో డ్రైవర్,వంట మనుషులు కూడా ఉంటారు.  పారామిలటరీ బలగాల్లో ప్రధానంగా బిఎస్ఎప్, సిఆర్ పిఎఫ్,ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ,మొదలయినవి కేంద్రం ఆధీనంలో ఉంటాయి. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు ,ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఈ బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయి. ఇక ఎపిఎస్ పి బెటాలియన్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.
ఆందోళనలను ఎలా అదుపు చేస్తారు.?
  దేశంలో ఎక్కడైనా ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం అక్కడికి పారామిలటరీలను పంపుతుంది. బందోబస్తుకు మాత్రం ఎక్కువగా ఎపిఎస్పి బెటాలియన్స్ వెళ్తారు. వీటికి స్థానిక పోలీస్టేషన్ లకు అటాచ్ చేస్తారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్లాటూన్ ల కదలికలు ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చే రాపిడాక్షన్ ఫోర్స్ లను అత్యంత సున్నిత ప్రాంతాల భద్రతకు వినియోగిస్తారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘర్షణలను వీరు వెంటనే కంట్రోల్ చేస్తారు. వీరికి టియర్ గ్యాస్ వాహనాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆందోళనకారులను అణిచివేయడంలో రాపిడాక్షన్ ఫోర్స్ నెంబర్ వన్. ఇక సిఆర్ పిఎఫ్.. ర్యాలీలు, ధర్నాలు, ముట్టడి వంటి ఆందోళనలను అడ్డుకుంటుంది. బిఎస్ఎఫ్ బలగాలు పండుగలు, మత ఘర్షణల సమస్యలను అదుపులోకి తెస్తాయి.
మరో వెయ్యి బలగాలు..
 
ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 1200బలగాలు మోహరించాయి. మరో వెయ్యి బలగాలను మహారాష్ట్ర, తమిళనాడు నుంచి తరలించారు.తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప లో భారీగా పారామిలటరీలు దిగనున్నాయి. ఇప్పటికే 25 వేల మంది పోలీసులు సీమాంధ్రలో ఉండగా మరో 15వేల మందిని పంపించేందుకు హోం శాఖ సిద్ధమైంది. యూనివర్సిటీలు కాలేజీలు, ఉద్యోగ సంస్థలు ,వ్యాపార సముదాయాదాల వద్ద ఈ బలగాలు మోహరిస్తాయి. విఐపిల ఇళ్ల దగ్గర బిఎస్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అడ్డుకునేందుకు తాము సిద్ధమని పోలీస్ శాఖ ప్రకటించింది.

No comments:

Post a Comment