ఢిల్లీ: ''తెలంగాణ అంశం వేరు...ఇతర రాష్ట్రాల విభజన
అంశాలు వేరు...'' అని కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్
సింగ్ చెప్పారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు
మార్గం సుగమం చేసినట్లు
ప్రకటించిన అనంతరం డిగ్గీరాజా మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ
సందర్బంగా విదర్భ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ
తెలంగాణ అంశంతో విదర్భ అంశాన్ని పోల్చలేమన్నారు. ఇతర రాష్ర్టాల విభజన
వాదనలనూ తెలంగాణ అంశంతో పరిగణించలేమన్నారు. ప్రత్యేక తెలంగాణ వాదన సుదీర్ఘ
కాలం నుండి నానుతోందన్నారు. ఆయా రాష్ర్టాల విభజన విషయంలో రెండవ ఎస్సార్సీని
పరిగణలోకి తీసుకొనే అవకాశం లేకపోలేదన్నారు. అయితే తెలంగాణ అంశం మొదటి
ఎస్సార్సీలోనూ చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణపై పలు రకాల కమిటీలు
అధ్యయనాలు జరిపామని చెప్పారు. పలుమార్లు ఆయా పార్టీల నేతల అభిప్రాయాలు
స్వీకరించామని తెలిపారు. ఇరు ప్రాంత నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామని
చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ తాము ఈ నిర్ణయం
తీసుకున్నామని చెప్పారు. కావున తెలంగాణ అంశం ఇతర రాష్ట్రాల విభజన వాదాలను
కలిపి చూడొద్దన్నారు.
No comments:
Post a Comment