Sunday, July 28, 2013

రాజకీయ ప్రయోజనాలతోనే ములాయం వ్యాఖ్యలు


హైదారబాద్ : చిన్న రాష్ట్రాలకు తాను వ్యతిరేకమని, తెలంగాణను అంగీకరించేది లేదని చెప్పిన సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రయోజనాలు
దాగివున్నాయని టెన్ టివి న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులు ప్రొ. నాగేశ్వర్ అన్నారు. తెలంగాణను సమర్ధిస్తే ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విభజన కోరుతూ ఆ రాష్ట్ర శాసన సభ కేంద్రానికి పంపిన తీర్మానాన్ని అంగీకరించాల్సివస్తుందనే ములాయం అటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమనే మొదటి నుంచి చెబుతోందని తెలిపారు. అయితే ములాయం తన వ్యాఖ్యలకు ఎంతవరకు కట్టుబడి ఉంటాడో వేచిచూడాలని అన్నారు. గతంలో అణు ఒప్పందం, ఎఫ్ డిఐ ల విషయంలో యుపిఎ నిర్ణయంతో ఏకీభవించని ములాయం చివరి నిమిషంలో మాట మార్చిన దాఖలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. అయితే రానున్న సాధారణ ఎన్నికలలో ములాయం కాంగ్రెస్ పార్టీకి కీలకం కానున్నందున కాంగ్రెస్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందేనన్నారు.

రాయలతెలంగాణ..

 రాయల తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే తాము వ్యతిరేకిస్తామని బిజెపి ప్రకటించడం ముఖ్యమైన విషయయని అన్నారు. ప్రత్యేక తెలంగాణకు తాము అనుకూలమని చెప్పిన బిజెపి ఎన్ డిఎ అధికారంలోకి వస్తే తాము తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతామని స్పష్టంగా చెప్పిందని అన్నారు. అయితే రాయల తెలంగాణను తాము వ్యతిరేకిస్తమని చెప్పడంతో ఈ ప్రతిపాదనను యుపిఎ ప్రభుత్వం ఆమోదింపజేసుకోవడంలో ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఒక వేళ సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తే ఆ పార్టీ ఇరకాటంలో పడినట్లేనని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోనూ అటు సీమాంధ్ర నేతలు, ఇటు తెలంగాణ ప్రాంత నేలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాజకీయ ఏకాభిప్రాయం రానంత వరకు ఈ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు ఎన్ డిఎ అధికారంలోకి వచ్చినప్పటికీ బిజెపి కి స్పష్టమైన మెజారిటీ ఉంటేనే తెలంగాణ బిల్ల ఆమోదమవుతుందని చెప్పారు. అయితే రాజకీయాలలో ఏ సమయంలో ఎటువంటి నాటకీయ పరిణామాలు జరగుతాయో ఎవరూ చెప్పలేరని అన్నారు.

టిడిపి పరిస్ధితి..
 గతంలో తెలంగాణ విషయంలో మౌనం వీడిన టిడిపి అధ్యక్షడు పొరపాటు చేశారని, దానికి పర్యవసానంగా ఆయన తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం కళ్లుమమూసుకునే సిద్ధాంతంతో ఇటు సీమాంధ్ర ప్రజలు, నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అసలు ఆ పార్టీకి తెలంగాణ పై ఒక స్పష్టమైన వైఖరి లేనందువల్లే కాంగ్రెస్ వింతనాటకంలో కొట్టుమిట్టాడుతోందని అన్నారు.
వైసిపి పరిస్ధితి...
 వైసిపి లో తెలంగాణ ముసలం మొదలైందని చెప్పారు. ఆ పార్టీ కాడా రాజకీయ ప్రయోజనాలకోసమే రాజీనామా నాటకాలకు తెరలేపిందని చెప్పారు. దీంతో ఆ పార్టీకి చెందని తెలంగాణ ప్రాంత నేతలు పూర్తి వ్యతిరేకతను వ్యక్తంచేశారని అన్నారు. త్వరలోనే వైసిపి తెలంగాణ నేతలంతా తిరుగుబాటు చేయడం తధ్యమని చెప్పారు. వైసిపి పార్టీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ఇచ్చే శక్తి, ఆపే శక్తి తమకు లేదని ఆ పార్టీ నేతలే ప్రకటించారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం తెలంగాణను ఆపే ఎందుకు చేస్తున్నారని ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానాన్ని తెలంగాణ వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పరిస్ధితి...
 కాంగ్రెస్ పార్టీలోనూ ఇరు ప్రాంతాల నేతలలో వైరుధ్యాలు పెరిగిపోయాయని , ఇప్పటికే ఒక ప్రాంతం నేతలు మరో ప్రాంతం నేతలు కుమ్ములాడుకుంటున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధాన విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నారనే వార్తలు వినిపించడమని అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన ఎప్పుడూ సమైక్యవాదిగానే ఉన్నారని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడివుంటామని చెప్పిన సీమాంధ్ర నేతలు ప్రస్తుతం పార్టీ నిర్ణయం తీసుకునే సమయంలో వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. తమ ప్రాంతాలలో రాజకీయ భవిష్యత్తు కోల్పోతామనే భయంతోనే వారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
గందరగోళానికి కారణం...
 రాష్ట్రంలో ఆయా పార్టీలు తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడం వల్లే గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఇప్పటివరకు సిపిఎం మాత్రమే విభజనపై తన స్పష్టమైన వైఖరిని తెలిపిందని గుర్తుచేశారు. బిజెపి కూడా తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించిందని కాబట్టి ఆ పార్టీలోనూ గందరగోళం లేదని చెప్పారు. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం పార్టీ వైఖరి ఎప్పటికప్పుడు మార్చుకనే ఊగిసలాటలో ఉన్న పార్టీలు సంక్షోభానికి గురికాక తప్పదని చెప్పారు.  

No comments:

Post a Comment