Tuesday, July 30, 2013

సమైక్యంగానే రాష్ట్రం: కేంద్ర మంత్రులు

ఢిల్లీ: సమైక్యాంధ్రకు అనుకూలంగానే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ లో మంగళవారం సోనియా
గాంధీతో భేటీ అయిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తమకు రాష్ట్ర విభజన కంటే రాష్ట్ర ప్రజల క్షేమం ముఖ్యమని చెప్పారు. పార్టీ భవిష్యత్ బాగుండేలా తాము నడుచుకుంటామన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. తమకు పదవుల కంటే ప్రజలు, రాష్ట్రం సమైక్యంగా ఉండడమే ముఖ్యమని మరో కేంద్ర మంత్రి జెడి శీలం అన్నారు. ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ పెద్దలు ఒపిగ్గా విన్నారన్నారు. ఏ ప్రాంతానికి నష్టం కల్గకుండా నిర్ణయం వస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. సోనియాకు మా అభిప్రాయాన్ని గట్టిగా విన్నవించామని చెప్పారు.  వారికి విభజన వల్ల ఎదురయ్యే పరిణామాలు వివరించామన్నారు.

1 comment:

  1. Pl watch Lagadapati's comments on formation of Telangana after the CWC's decission:

    http://www.youtube.com/watch?v=Z0gPJEuf1mY&feature=youtu.be&noredirect=1

    ReplyDelete