Tuesday, July 30, 2013

ముగిసిన సమన్వయ కమిటీ భేటీ..

ఢిల్లీ: ప్రధాని నివాసంలో జరిగిన యుపిఎ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ఈసమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్
బొత్స సత్యనారాయణను ఆహ్వానించారు. మంగళవారం సాయంత్ర 4 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం గంటపాటు సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మంత్రులు షిండే, చిదంబరం, కమల్ నాధ్, ఆజాద్, దిగ్విజయ్ సింగ్, తో పాటు యుపిఎ మిత్రపక్ష నేతలు అజిత్ సింగ్ , శరత్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లాలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలుబడనుందన్న వార్తల నేపధ్యంలో సిఎం, పిసిసి చీఫ్ లను ఈ భేటీకి ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఈ సమావేశంలో ఎన్ సిపి, ఆర్ ఎల్ డి లు తెలంగాణకు అనుకూలమని తెలిపారు.

No comments:

Post a Comment