Friday, July 12, 2013

యాపిల్‌ కంప్యూటర్‌ వేలం


ఒరిజినల్‌ యాపిల్‌ కంప్యూటర్‌ను ఇక్కడ వేలంలో దాదాపు 388,000 డాలర్లకు విక్రయించారు. యాపిల్‌-1గా పేరొందిన 1976 నాటి ఈ కంప్యూటర్‌
యాపిల్‌ కంప్యూటర్స్‌ మొదటగా రూపొందించిన కంప్యూటర్లలో ఒకటి. ఆన్‌లైన్‌లో మాత్రమే సాగే క్రిస్టీ వేలంలో సోమవారం నాడు దీన్ని 3,87,750 డాలర్లకు విక్రయించారు. తాము ఆ కంప్యూటన్‌ను కొనుగోలు చేసినట్లు ఇటాలియన్‌ కలెక్షన్స్‌ కంపెనీకి చెందిన బొలాఫి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమ్మినవారు కాలిఫోర్నియాకి చెందిన రిటైర్డ్‌ స్కూల్‌ సైకాలజిస్ట్‌.

2011 అక్టోబరులో స్టీవ్‌ జాబ్‌ చనిపోయిన దగ్గర్నుండి వింటేజ్‌ యాపిల్‌ ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగింది. కాలిఫోర్నియా గ్యారేజ్‌లో స్టీవ్‌ వొజ్నియాక్‌తో కలిసి స్టీవ్‌ జాబ్స్‌ కంప్యూటర్‌ ప్రోటోటైప్స్‌ను నిర్మించారు. వొజ్నియాక్‌ యాపిల్‌-1ను నిర్మించారు. మరో యాపిల్‌-1 మే నెల్లో రికార్డు స్థాయిలో 6,71,400 డాలర్లకు అమ్ముడుపోయింది. జర్మనీ వేలం హౌస్‌లో దీన్ని విక్రయించారు. నవంబరులో ఈ హౌస్‌ నెలకొల్పిన 6,49,000 డాలర్ల రికార్డును ఇది బ్రేక్‌ చేసింది. 

No comments:

Post a Comment