బ్రెడ్ పాన్ కేక్ లేదా బ్రెడ్ ఊతపం అనికూడా అనవచ్చు. ఇది బ్రెడ్ పాన్ కేక్ రిసిపి వెరీ హెల్తీ మరియు టేస్టీ బ్రేక్ ఫాస్ట్. ఇది చూడటానికి రవ్వ పాన్ కేక్ లా అనిపిస్తుంది. కానీ ఇది పూర్తి డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. మంచి ఫ్లేవర్ టేస్ట్ కొరకు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ను మిక్స్ చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్ కు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇది త్వరగా సులభంగా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్ రిసిపి. మరి మీరు బ్రెడ్ పాన్ కేక్ రుచి చూడాలంటే మీరు ట్రై చేసి చూడండి
కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు: 10 పాలు: 1cup ఉల్లితరుగు: 1/2cup క్యాప్సికమ్ తరుగు: 1/2cup టొమాటో తరుగు: 1/2cup బంగాళదుంప తురుము: 1/2cup పచ్చిమిర్చి: tbsp అల్లం తురుము: 1tbsp కొత్తిమీర తరుగు: 2tbps ఉప్పు: రుచికి తగినంత కారం: 1/2tsp గరంమసాలా: 1/2tsp నూనె: డీప్ ఫ్రైకి సరిపడా తయారుచేయు విధానం: 1. ముందుగా బ్రెడ్ స్లైసుల అంచులను తీసేసి, బ్రెడ్ ను పొడిలా చేసి, అర కప్పు పాలలో పదినిముషాలు నానబెట్టాలి. 2. తర్వాత పాలు తప్ప మిగిలిన వస్తువులన్నీ ఒక గిన్నెలో వేసి, నూనె కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. 3. తర్వాత పాలు జతచేసి దోసె మిశ్రమంలా తయారుచేయాలి కొద్దిగా జిగురుగా ఉండాలి. లేదంటే మరీ మెత్తగా అయిపోయి, సరిగా రావు. 4. ఇప్పుడు స్టౌ మీద పాన్ ఉంచి, వేడయ్యాక నూనె రాయాలి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పెనం మీద వేసి, దోసె మాదిరిగా కొద్దిగా మందంగా వేయాలి. గోధుమరంగులోకి మారాక రెండవవైపులా తిప్పి కాలనివ్వాలి. అంతే బ్రెడ్ పాన్ కేక్ రెడీ

No comments:
Post a Comment