Friday, July 12, 2013

బ్రహ్మజెముడు కానుక


విడాకులు తీసుకుంటున్న దంపతులు 'బ్రహ్మజెముడు'ను ఒకరికొకరు కానుకగా ఇచ్చుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది.'దంపతులే కాకుండా స్నేహితులు కూడా విడిపోయేముందు ఇలా
బ్రహ్మజెముడుని ఇచ్చుకుంటున్నారు.'నా బాయ్ ఫ్రెండ్‌కు బ్రహ్మజెముడు ఇచ్చేస్తున్నా' అని ఓ గాళ్‌ఫ్రెండ్‌ అంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్‌ నుంచి విడిపోతోందని అర్థం. ఇలా పడని స్నేహితులు, దంపతులు కలిసి బ్రహ్మజెముడుకు నిన్నటి దాకా లేని కొత్త అర్థాన్ని కల్పించారు. బ్రహ్మజెముడు ఇస్తున్నా అన్నమాట విడిపోవడానికి సంకేతమైంది. బ్రహ్మజెముడు ఇంతదాకా సౌందర్య పోషణ ఔషధంగా వాడతారనే మనకు తెలుసు. ఇప్పుడు దానికి కొత్త ప్రాముఖ్యత వచ్చింది.బ్రహ్మజెముడు ముళ్లతో కొంచెం గజిబిజిగా కనపడుతుంది. ఇది దాంపత్యం లేదా స్నేహం సరిగా లేకపోవడాన్ని సూచిస్తోంది. కనుక బ్రహ్మజెముడు ఇచ్చుకోవడం విడిపోవడానికి సంకేతంగా మారింది. ఇప్పుడు మనదేశంలో ముంబై వంటి పెద్ద నగరాలకు కూడా ఈ కొత్త ఆనవాయితీ పాకింది.

No comments:

Post a Comment