హైదరాబాద్ : రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. గాంధీ భవన్ లో
సోమవారం కాంగ్రెస్ పదాదికారుల సమావేశం దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలన్నారు. వారం, పది రోజుల్లో ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరగనుందని, దానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పిలవనున్నామని డిగ్గీ రాజా చెప్పారు. నేతలు వ్యాపారాలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. రాజశేఖరరెడ్డి తనకు ఆప్తుడని తెలిపారు. రాజశేఖరరెడ్డిలో ఉన్న నిజాయతీ జగన్ లో లేదని విమర్శించారు. జగన్ లో కాంగ్రెస్ డిఎన్ఏనే ఉందని దిగ్విజయ్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment