మహబూబ్ నగర్: వారసుడు లేడనే కోపంతో కన్న కూతురికి విషమిచ్చి చంపిన దారుణం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివవాలిలా ఉన్నాయి..
మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయి గూడలో నివాసముంటున్న శేఖర్ దంపతులు నివాసముంటున్నారు. రోజూ లాగే తాగొచ్చిన శేఖర్ భార్యను తీవ్రంగా కొట్టాడు. అదే సమయంలో తనకు ఇద్దరూ అమ్మాయిలేనని, వారసుడు లేడని మనస్తాపానికి గురైన శేఖర్ పెద్ద కుమార్తె వెన్నెలకు బలవంతంగా పురుగు మందు తాగించాడు. దీన్ని గమనించిన శేఖర్ భార్య వెంటనే కుమార్తెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెన్నెల మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు..png)
No comments:
Post a Comment