Friday, June 28, 2013

గర్భిణీల కాళ్ళు వాపులను నివారించే సులభ చిట్కాలు


       సాధారణంగా మహిళలు గర్భిణీగా వున్నపుడు కాళ్ళు వాపు రావటమనేది సహజం. అది అసౌకర్యమే. కాదనేది లేదు. గట్టిగా చెప్పే కారణం కూడా కనపడదు. కాళ్ళు మాత్రమే కాదు శరీరమంతా కూడా ఉబ్బుతుంది. గర్భవతిగా వున్నపుడు
మీరు లావెక్కినపుడు అందులో మూడు వంతుల బరువు నీటిది మాత్రమే. కనుక బిడ్డ పుట్టిన తర్వాత ఈ బరువు తగ్గటానికి మీరు శ్రమపడాల్సిన అవసరంలేదు. నీటి వలన ఏర్పడిన బరువు దానంతట అదే తగ్గిపోతుంది. సమస్య తీవ్రత ఎపుడు అధికంగా వుంటుందంటే....బాగా అలసిన తర్వాత రాత్రి పడుకునేటపుడు ఎండా కాలంలో చాలా బాధాకరంగా వుంటుంది.
           కాళ్లు ఎందుకా వాపు చూసిస్తాయి? వైద్య భాషలో దీనిని ఎడిమా అంటారు. శరీరం అధిక నీటిని రక్తాన్ని ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదలకు ఉత్పత్తి చేస్తుంది. మీ బేబీ కడుపులోని నీటిలో తేలియాడుతూ వుంటుంది. ఈ అదనపు నీరు అంతా ఎక్కడికో అక్కడికి పోవాలి కనుక అది శరీరం కిందిభాగమైన కాళ్ళలోకి చేరిపోతుంది. పొట్ట పెరుగుతూంటే, దిగువ భాగం శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తసరఫరా నిమ్మదిస్తుంది. గర్భిణీకి మూడవ త్రైమాసికంలో కాళ్ళు, చేతులు వాపురావటం అధికంగా వుండి అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవ‌డం ద్వారా కాళ్ళవాపులు,పాదాల వాపుల బాధ‌ల‌నుంచి కొంచెం ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.
గర్భిణీల కాళ్ళు వాపులను నివారించే సులభ చిట్కాలు
దీనినుండి రిలీఫ్ పొందటమెలా?సాధార‌ణంగా 75 శాతం మంది గ‌ర్భిణీ స్త్రీల‌కు ఏడ‌వ మాసం వ‌చ్చేస‌రికి పాదాలు,కాళ్ళకు వాపులు వ‌స్తాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.ఉద్యోగ‌స్తులైన‌గ‌ర్భిణీ స్త్రీలు ప‌గ‌టిపూట విశ్రాంతి లేకుడా ఎక్కువ స‌మ‌యం బ‌య‌ట‌నేగ‌డ‌ప‌డం,రాళ్ళు క్రింద‌కు వేళ్ళాడేసి కూర్చోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్యమ‌రింత ఎక్కువ‌గగాఉంది .కాబ‌ట్టి ఉద‌యం పూట కొంచెం ఉప‌శ‌మ‌నంగా వుంటుంది. ప‌గ‌లు మ‌ళ్ళీ వాపులు కావ‌డం మామూలే. కాబట్టి ప్రతి రోజూ కొంత నడక అలాగే డాక్టర్ సలహా మేరకు వ్యాయామం చేయడం చాలా అవసరం.
              పాదాలను నీళ్ళలో నానబెట్టుకోవాలి: కాళ్ళను నీళ్ళలో ఉంచడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకు గర్భిణీ స్విమ్మింగ్ చేయడం కూడా మంచిదే. ఒక వేళ అది వీలుకాకపోతే, మీ శరీరాన్ని టబ్ లో కొంత సేపు విశ్రాంతి పరచండి. అయితే ఖచ్చితంగా టబ్ బాటర్ చాలా వేడిగా లేకుండా చూసుకోండి. చాలా వేడిగా ఉన్న నీళ్ళు ప్రెగ్నెంట్ మహిళలకు అంత మంచిది కాదు.
కాళ్ళను ఎత్తులో పెట్టుకోవాలి: ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల కాళ్ళు వాపులు అవ్వడం చాలా సహజం. ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలో బ్లడ్ షర్యులేషన్ సరిగా జరగక కాళ్ళ వాపులకు రావచ్చు. కాబట్టి, కాళ్ళను ఎపుడు పైకి పెట్టగలిగితే అపుడు పైన పెడుతూ కూర్చోండి. పనిలో కష్టమే. కాని పరిస్ధితి అటువంటిది. కాళ్ళు పైకి పెట్టేందుకై చిన్నపాటి ఎత్తున్న బల్ల లేదా స్టూలు వుంచుకోండి. అధిక రక్తం కాళ్ళవైపుకు రాకుండా వుంటుంది.
           ఎడమవైపు తిరిగి పడుకోవాలి: గర్భిణీ స్త్రీలు, ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల బ్లడ్ సర్యులేషన్ బాగా జరుగుతుంది. కాబట్టి చాలా వరకూ మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి.
        ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి: కాళ్ళ వాపులు తగ్గాలంటే, ఆహార పరంగా పొటాషియం అధికంగాను, సోడియం తక్కువగాను వున్న పదార్ధాలు తినాలి. పదార్ధాలలో ఉప్పు బాగా తగ్గించండి. ఉప్పుకు నీటిని నిలువ చేసే గుణం వుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం కూడా మంచిదే. దిగువ శరీరంలోని ప్రధాన రక్త నాళాలు లావెక్కిన మీ శరీరానికి కొంత సౌఖ్యాన్నిస్తాయి.
తగినన్ని నీళ్ళు త్రాగాలి: రోజుకు క‌నీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగాలి.
సాక్స్ లు: కాళ్ళకు సాక్స్ వేసుకునేవారు టైట్ గా ఉండి,ఎలాస్టిక్ క‌లిగిన సాక్స్ ల‌ను వేసుకోకూడ‌దు.
కొంత‌మంది మ‌హిళ‌ల‌కు వాపులు కాళ్ళు పాదాల‌కు మాత్రయే ప‌రిమితం కావు. చేతులు మొహం కూడా వాచి లావుగా ,బ‌రువుగా అవుతాయి. అటుంవంటివారు వేంట‌నే డాక్టరు ను సంప్రదించాలి.

No comments:

Post a Comment