Monday, June 24, 2013

ముప్ల్పై ఏళ్ల స్ఫూర్తి ..!


  • విజయం ఏదైనా మధురమే. అయితే కలకాలం గుర్తుండిపోతే మరిన్ని విజయాలకు స్ఫూర్తిగానిలిచే విజయాలు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. భారత క్రికెట్‌ చరిత్ర గతినే మార్చేసిన అలాంటి అరుదైన, అసాధారణ విజయాన్ని మన కపిల్‌సేన సొంతం చేసుకొంది 1983 జూన్‌ 25న. ప్రపంచ క్రికెట్‌ కప్‌ను కపిల్‌ సేన గెలిచిన ఆ 'భలే మంచి రోజు'కు సరిగ్గా నేటితో 30 ఏళ్లు నిండాయి. నాటి ఈ అపురూప ఘట్టాన్ని మరోసారి గుర్తు చేసుకొందాం...
1983 జూన్‌ 25. భారత క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రోజు. క్రికెట్టే ఊపిరిగా భావించే నాటి, నేటి తరాల భారత క్రికెట్‌ అభిమానులకు పండుగరోజు.
అది క్రికెట్‌ మక్కాలార్డ్స్‌ స్టేడియం. మూడు దశాబ్దాల క్రితం, కచ్చితంగా ఇదే రోజున మన కపిల్‌సేన వన్డే ప్రపంచ కప్‌ కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన రోజు. వన్డే క్రికెట్లో మహా శిఖరంలాంటి వెస్టిండీస్‌ను అనామక భారతజట్టు తుత్తునీయలు చేసిన రోజు.
ఆ రోజుల్లో...
1970 దశకంలో క్రికెట్‌ కేవలం పెద్దమనషుల క్రీడ మాత్రమే. నేటిలా బజారు, దిగజారుడు క్రీడ ఏమాత్రమూ కాదు. క్రికెట్‌ను క్రికెట్‌లా మాత్రమే ఆడేరోజులవి. ఐదురోజులటెస్ట్‌ క్రికెట్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన వన్డే క్రికెట్లో అది వీరభయంకర వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు రాజ్యమేలుతున్న రోజులవి.
1975, 1979 ప్రుడెన్షియల్‌ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఎందుకూ పనికిరాని జట్టుగా ఉండేది. పోటీల్లో పాల్గొనటం అంటే దారి ఖర్చులే దండుగ అన్నట్లుగా ఉండేది. అలాంటి పరిస్థితిలోనే హర్యానా హరికేనే కపిల్‌దేవ్‌ నాయకత్వంలో భారతజట్టు 1983 ప్రపంచకప్‌లో పాల్గొనటానికి వెళ్లింది.
సునీల్‌ గవాస్కర్‌, కృష్ణమాచారీ శ్రీకాంత్‌, సందీప్‌ పాటిల్‌, కీర్తి అజాద్‌, రోజర్‌ బిన్నీ, మదన్‌లాల్‌, కిర్మానీ, బల్విందర్‌సింగ్‌ సంధూ, మెహందర్‌ అమర్‌నాథ్‌ లాంటి ఆటగాళ్లతో కూడిన కపిల్‌ డెవిల్స్‌కు మరో ఘోరవైఫల్యం తప్పదని అందరూ అనుకొన్నారు. టర్న్‌ బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేతో జరిగిన గ్రూప్‌లీగ్‌ మ్యాచ్‌లో కపిల్‌ విశ్వరూపం ప్రదర్శించడంతోనే మన కపిల్‌సేనకు ఒక్కసారిగా అమితమైన బలం వచ్చేసింది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియలాంటి జట్లను తుక్కు కింద బాది ఫైనల్లో అడుగుపెట్టింది. అవునా.. నిజమేనా.. భారతజట్టు ఫైనల్‌ చేరిందా.. అంటూ ముక్కుమీద వేలేసుకోడం అభిమానుల వంతయింది.
లార్ట్స్‌కే లార్ట్స్‌...
1983 ప్రపంచకప్‌లో అది ఆఖరి ఘట్టం. క్రికెట్‌ మక్కాలార్డ్స్‌ స్టేడియంలో పతాక సన్నివేశం. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌, వన్డే క్రికెట్‌ మేరుపర్వతం లాంటి వెస్టిండీస్‌ను పసికూనలాంటి భారతజట్టు ఢకొీనే రోజది.
క్లైవ్‌లాయిడ్‌ నాయకత్వంలోని కరీబియన్‌ ఆర్మీలో గార్డన్‌ గ్రీనిడ్జ్‌, వివియనేరిచర్డ్స్‌, జోయెల్‌ గార్నర్‌, ముర్రే లాంటి... పేరుతోనే భయపెట్టే మహాసైనికులున్నారు. వరుసగా మూడో ప్రపంచకప్‌పై కన్నేసిన వెస్టిండీస్‌ చేతిలో అనామక, గాలివాటం భారతజట్టుకు ఘోరపరాజయం తప్పదని సాధారణ అభిమానులేకాదు, తలలు పండిన క్రికెట్‌ పండితులే చెప్పారు. అయితే లార్డ్స్‌ మైదానంలో జూన్‌ 25న జరిగిన ఆ ఆఖరి పోరాటం మాత్రం మరోలా ముగిసింది.
సంధూస్వింగ్‌.. కపిల్‌క్యాచ్‌
అసలే ఫైనల్‌, ఆపైనా వెస్టిండీస్‌లాంటి ప్రత్యర్థి. ఇంకేముంది ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు తక్కువ స్కోరుకే కుప్ప కూలింది. వెస్టిండీస్‌ బౌలింగ్‌ ధాటికి పేకమేడలా పడిపోయింది.
183 పరుగుల విజయ లక్ష్యం సాధించడం కేవలం గంటలో ముగిసిపోయే పని అన్నట్లుగా లాయిడ్‌ సైన్యం భావించింది. అయితే జరగాల్సింది మరోలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. తొలి ఓవర్‌ నుంచే భారత్‌ దూకుడుగా ఆడింది. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఎదురుదాడి చేసింది.
భారత ఓపెనింగ్‌ బౌలర్‌ బల్విందర్‌సింగ్‌ సంధూ ఓ అసాధారణ ఇన్‌స్వింగర్‌తో కరీబియన్‌స్టార్‌ ఓపెనర్‌ గ్రీనిడ్జ్‌ను పడగొట్టి శుభారంభాన్ని ఇచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వీరబాదుడు వివియన్‌రిచర్డ్స్‌ మాత్రం చూయింగ్‌గమ్‌ నమిలినంత తేలిగ్గా షాట్లు కొడుతూ బౌండ్రీల వర్షం కురిపించి భారత అభిమానుల ఆశలపై నీరుచల్లాడు. అలాంటి సమయంలోనే భారత కెప్టెన్‌ కపిల్దేవ్ ఓ అద్భుతం చేశాడు.
మీడియం పేసర్ మదన్లాల్ బౌలింగ్ రిచర్డ్స్ కొట్టిన బంతిని కపిల్ 30 అడుగుల దూరం పరిగెత్తి మరీ అనుహ్యంగా అందుకొన్నాడు. ఇక అంతే ఒక్కసారి గాలి భారత్ వైపు మళ్లింది. సాహనం చేసేవారి వెన్నంటే అదృష్టం ఉటుందన్న మాట నిజమయ్యింది. 
మొహిందర్ అమర్ నాథ్, కపిల్, బిన్నీ, మదన్లాల్, సంధూ ఇలా ఒక్కరేమిటీ... భారత్ బౌలర్లంతా కలిసికట్టుగా దాడి చేసి కరీయన్ కోటను ముట్టడించారు. దీంతో వెస్టిండీస్ కెప్టెన్ లాయిడ్ హ్యాట్రిక్ ఆశలు లార్డ్స్ మట్టిలో కలిసిపోయాయి. తక్కువ స్కోరుతోనే అతి పెద్ద విజయం సాధించిన భారత జట్టు వన్డే ప్రపంచ చాంపియన్ గా చరిత్ర సృష్టించింది. మొహిందర్ అమర్ నాథ్ మ్యాన్ ఆఫ్ ది ఫైనల్గా నిలిస్తే, ప్రుడెన్షియల్ ప్రపంచకప్ను కపిల్దేవ్ సగర్వంగా అందుకొన్నాడు. క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలు, మీడియా హంగామా, ఓవర్ యాక్షన్ అంతగాలేని ఆరోజుల్లో పాపం కోట్లాది మంది పిచ్చి భారత్ క్కికెట్ అభిమానులు రేడియో వ్యాఖ్యానం వింటూనే తరంచిపోయారు. 
ముప్ల్పై ఏళ్ల క్రితం ఇదే రోజున సేవ సాధించిన ఆ అసాధారణ విజయం స్వరూపం స్వభావాలే మరిపోయాయి. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో టీమిండియా టీ- 20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ విజయాలు సధించనా, టెస్ట్ నెంబర్ వన్ ర్యాంకుల్లో నిలిచినా.. అది మూడు దశాబ్దాల క్రితం కపిల్ డెవిల్స్ సాధించాన విజయానికి కొనసాగింపు మాత్రమే.
విజయాలు ఎన్నున్నా తొలి గెలుపును మించిన మధురానుభవం నిరంత స్ఫూర్తి మరొకటి ఉండవు.
దేశప్రజలు మరో ప్రపంచ కప్ చూడవలసింది. కోరుటుంన్నాను.

No comments:

Post a Comment