సాధారణంగా మనందరం మన ఇల్లు చాలా అందంగా మరియు అలంకరణగా ఉండాలని కోరుకుంటాం. అయితే మీరు మీ ఇంటికి ఒక ప్రత్యేకత ఉండాలని, ఇతరులను ఇంప్రెష్ చేయాలను కోరుకొనే వారైతే, మీరు ఖచ్చితంగా తెలుపు-నలుపు కాంబినేషన్ థీమ్ ను ప్రయత్నింంచవచ్చు. నలుపు మరియు తెలుపు ఈ రెండింటిని విడి విడిగా తీసుకుంటే వేటికి అవే అందానికి నిదర్శనం. ఈ రెండు అందంలో ప్రాథమిక రంగులుగా ఉన్నాయి. అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఆకర్షణీయంగా ఉండేంట్లు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి, మీరు మీ ఇంటికి ఒక ప్రత్యేకత తీసుకురావాలనుకుంటే, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీ ఫస్ట్ చాయిస్. మీ ఇంటి అలంకరణలో ఒక సాధారణ, ఆకర్షణీయమైన అలంకరణకు ఒక మంచి ఉపాయం. అందుకు కావలసిందల్లా కొన్ని సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉండటమే. మీ ఇంటి అలంకరణకు మీ ఆలోచనలకు తోడుగా మరికొన్ని సూచనలు తోడైతే మరింత ఆకర్షణీయంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ డెకరేషన్ థీమ్ కోసం కొన్ని చిట్కాలు మీ కోసం...
1. బ్లాక్ ఫర్నీచర్: మీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇంటి అలంకరణకు బ్లాక్ ఫర్నీచర్ చాలా బాగా సూట్ అవుతుంది. బ్లాక్ ఫర్నీచర్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. అందుకు మీరు సరైన లెదర్ కోచ్ కొనాలనుకుంటే, అది బ్లాక్ కలర్ లో లభ్యం అవుతుంది. చాలా వరకూ బెడ్ షీట్స్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్స్ లో వస్తున్నాయి. వాటిని ఎంపిక చేసుకోవడంతో పాటు, ఐరన్ ఫర్నీచర్ కు ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే ఇవి త్వరగా పాడవ్వవు మరియు ఇవి ఏకరీతిలో నల్లగా ఉంటాయి. 2. తెల్లని గోడలు: మీ వాల్ పెయింట్ ఎప్పటికీ బ్లాక్ ఉండకూడదు. బ్లాక్ గోడలు మీ గదిలో కాంతిని మరియు మీ గదిని డార్క్ గా మార్చేస్తుంది. కాబట్టి గోడలకు ముఖ్యంగా తెలుపు రంగు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మరియు అలంకరణ కోసం బ్లాక్ హైలెట్స్ మరియు అలంకరణ చేసుకోవచ్చు. 3. బ్లాక్ అండ్ వైట్ పద్ధతులు: మీకు మోడ్రన్ ఆర్ట్ చూసారంటే, అవి చాలా వరకూ బ్లాక్ అండ్ వైట్ కలర్ లోనే ఉంటాయి. మీ ఇంటి అలంకరణ కోసం అటువంటి పెయింటింగ్స్ ను ఎంపిక చేసుకోవడం చాలా మంచి పద్దతి. ప్రస్తుత రోజుల్లో స్ట్రక్చ్డ్ వాల్స్ పెయింట్స్ చాలా ఫ్యాషన్ గా ఉన్నాయి. మీ ఇంటి అలంకరణను గోడలపై కళాత్మకంగా చేయడానికి బ్లాక్ అండ్ వైట్ అల్లికలను ఎంపిక చేసుకోవచ్చు. 4. శిల్పాలు: ఐన్ లేదా రాయితో చేసిన లేదా మట్టి శిల్పాలను మనం నల్ల రంగుల్లో చూడవచ్చు. బ్లాక్ విగ్రహాలు చాలా వరకూ అందుబాటులో ఉన్నాయి మరియు చేతిపనుల సొగసైనవిగా అలంకరించబడినవి కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇంటి అలంకరణకు జంతుప్రదర్శశాలను జోడించుకోవచ్చు. 5. చెస్ బోర్డ్ పద్ధతి: మీ ఇంట్లో కానీ, బాత్ రూమ్ లో కానీ చెస్ బోర్డ్ ను పోలిన టైల్స్ ఉపయోగించడం వల్ల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మీ బాత్ రూమ్ మరింత ప్రకాశవంతంగా కనిపించాలంటే అందుకు ఇటువంటి చెస్ బోర్డ్ ప్యాట్రన్ ను ఎంపిక చేసుకోవాలి. 6. బ్లాక్ బాత్రూమ్ ఫిట్టింగ్స్: బాత్ రూమ్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ డెక్కర్ థీమ్ ను ఎంపిక చేసుకోదలచుకుంటే, బ్లాక్ బాత్ ఫిట్టింగ్స్ ను ఇన్ స్టాల్ చేసుకోండి . ఇది ఒక అదనపు అలంకరణగా ఉంటుంది. మరియు వైట్ బాత్ వలే ఇది అంత త్వరగా మాసిపోదు, కలర్ షేడ్ అవ్వదు. ఇది కాకుండా, బ్లాక్ బాత్ టబ్ ను ఫిక్స్ చేసుకొని మీ స్నానాల గదికి మరింత ఆకర్షనీయతను పెంచండి. ఇవన్నీ మీ అభిరుచికి తగ్గట్టు బ్లాక్ అండ్ వైట్ డెకెర్ థీమ్ కు సహాయపడుతాయి. మీరు కూడా మీ ఇంటి అలంకరణకు బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఎంపిక చేసుకుంటే ఇలా ట్రై చేసి చూడండి...

No comments:
Post a Comment