నోరూరించే వేడి వేడి ఛాట్-మసాలా పూరి
వర్షాకాలం మొదలైంది నోటికి వేడి వేడిగా..కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని అదేపనిగా బజ్జీ, బోండా, వడలు రోజూ తినలేం కదా..ఒక వేళ తిన్నా నూనె పదర్థాలు మన ఆరోగ్యాన్ని పాడు చేయడం ఖాయం. మరి ఇటువంటి సమయంలో సులభంగా తయారు చేసుకొనేవి, తేలికగా జీర్ణం అయ్యేవాటి మీద మనస్సు మళ్లించాలి. వర్షాకాలంలో చిరు జల్లులు పడుతున్న సమయంలో వేడి వేడి ఛాట్స్ నోరూరింస్తుంటాయి. మరియ ఇంటిల్లిపాది తినేటటువంటి ఆరోగ్యభరితమైన ఛాట్స్ మీకోసం..మీరు ఈ ఛాట్ తయారుచేసుకొని రుచి చూడండి...కావలసిన పదార్థాలుఉడకబెట్టిన బఠాణీ గింజలు : రెండు కప్పులుపచ్చిమిర్చి:3వెజిటబుల్ ఆయిల్:ఒక టేబుల్‌స్పూన్‌పచ్చికారం:ఒక టేబుల్ స్పూన్‌గరం మసాలా:ఒక టేబుల్ స్పూన్‌ఛాట్ మసాలా:ఒక టేబుల్ స్పూన్‌బ్లాక్, రాక్ సాల్ట్:అర టేబుల్ స్పూన్‌జీలకర్ర పొడి: అరటేబుల్ స్పూన్‌మిరియాలపొడి:అర టేబుల్ స్పూన్‌తీపి చింతపండు చట్నీ: రెండు టేబుల్ స్పూన్లుపెరుగు:అరకప్పుఉల్లిపాయ:ఒకటి (సన్నగా తరిగినది)టమాటా: ఒకటి (చిన్నముక్కలుగా తరిగినది)పూరీలు:పదిహేనుసన్నకారప్పూస:ఒక కప్పుఉప్పు:తగినంత
తయారు చేసే విధానం:1. ఉడికించిన బఠానీలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానికి కొద్దిగా నీళ్లను చేర్చి జారుగా చేసుకోవాలి. 2. తర్వాత స్టౌవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి దానిలో ఈ ముద్దను వేసి కొద్దిసేపు ఉడికించాలి. దీనికి పచ్చికారం, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి, జీలకర్ర పొడి కలపాలి.3. అన్నింటిని వేసి బాగా కలిపి ఐదునిమిషాలు ఉడికించాలి. కొద్దిగా జారుగా అవడానికి కావలసినంత నీటిని పోయండి.4. దీనిని తినే ప్లేటులోకి తీసుకుని దీనిమీద వేయించిన పూరీలను ముక్కలుగా చేసి వేయాలి. దీనిపై చింతపండు చట్నీ, ఛాట్‌మసాలా, బ్లాక్ సాల్ట్, పెరుగు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, సన్నకారప్పూసతో సర్వ్ చేయండి. రుచి అమోఘంగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment