హైదరాబాద్: వచ్చే నెలలో డిఎస్సీ ద్వారా 22 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి పార్ధసారథి గురువారం ప్రకటించారు. ఈ మేరకు
జులై మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా టెట్, డిఎస్సీలను కలిపి ఓకే పరీక్ష నిర్వహిస్తారని గతంలో విద్యాశాఖ అధికారులు చెప్పినప్పటికీ మంత్రి ప్రకటనతో ఈ సారి డిఎస్సీ పై అనుమానాలు తొలగిపోయినట్లే నని నిరుద్యోగ అభ్యర్ధులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం హడావుడిగా నోటిఫికేషన్ ను విడుదల చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. 
No comments:
Post a Comment