కడప: జిల్లాలోని బ్రహ్మణీ స్టీల్స్ పరిశ్రమ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మలమడుగు ఆర్డీఓ హరినాధ్ రెడ్డి గురువారం అధికారుల బృందంతో
వచ్చి పరిశ్రమ భూముల కొలతలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకే తాము బ్రహ్మణీ స్టీల్స్ కు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆర్డీఓ మీడియాకు తెలిపారు. మరోవైపు వైఎస్ హయాంలో గాలి జనార్ధన్ రెడ్డికి కెటాయించిన ఈ బ్రహ్మాణీ స్టీల్స్ కు చెందిన వేల ఎకరాల భూమిని తనఖా పెట్టి పొద్దుటూరు ఐసిఐసిఐ బ్యాంకులో లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment