వర్షాకాలం మొదలైంది నోటికి వేడి వేడిగా..కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని అదేపనిగా బజ్జీ, బోండా, వడలు రోజూ తినలేం కదా..ఒక వేళ తిన్నా నూనె పదర్థాలు మన ఆరోగ్యాన్ని పాడు చేయడం ఖాయం. మరి ఇటువంటి సమయంలో సులభంగా తయారు చేసుకొనేవి, తేలికగా జీర్ణం అయ్యేవాటి మీద మనస్సు మళ్లించాలి. వర్షాకాలంలో చిరు జల్లులు పడుతున్న సమయంలో వేడి వేడి ఛాట్స్ నోరూరింస్తుంటాయి. మరియ ఇంటిల్లిపాది తినేటటువంటి ఆరోగ్యభరితమైన ఛాట్స్ మీకోసం.. ఈ ఛాట్ కు కావల్సిన పదార్థాలన్నీ ఇంట్లోనే ఉంటాయి. ముఖ్యంగా భేల్ పూరికి , మరమరాలు మరియు సన్న కార్పూస ఈ రెండు ప్రధానమైనవి మిగిలినవన్నీ మన వంటగదిలో నిల్వ ఉండే వస్తువులే కాబట్టి తయారు చేయడం కూడా చాలా సులభం. తక్కువ కేలరీల ఆహారం ఇది. రుచికరమైనది కాబట్టి పిల్లలకు తినడానికి ఎంతో ఇష్టపడతారు.మీరు ఈ ఛాట్ తయారుచేసుకొని రుచి చూడండి...
కావలసిన పదార్థాలు: మరమరాలు: 100grms ఉడకబెట్టిన బంగాళాదుంపల ముద్ద: 1/2cup చింతపండు: 50grms. బెల్లం: 50grms సన్న కారప్పూస: 50grms పుదీనా ఆకులు: ఒకకట్ట ఛాట్ మసాలా: tbsp కొత్తిమీర: ఒకకట్ట పచ్చిమిర్చి: 3 ఉప్పు: రుచికి తగినంత తయారు చేయు విధానం: 1. ముందుగా బెల్లాన్ని నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మరిగించిన తరువాత చింతపండును కప్పు వేడినీటిలో వేసి కొద్దిగా చిక్కబడేవరకూ మరిగించి పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత దీనికి పచ్చిమిర్చి ముక్కలను, పుదీనా ఆకులను కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత ఉడికిన బంగాళా దుంపలను తీసుకుని దానికి ఛాట్‌మసాలా వేసి బాగా కలపాలి. 4. ఇప్పుడు మరమరాలను ఒక బౌల్‌లోకి తీసుకుని పుదీనా పేస్ట్‌ను కలపాలి. దీనిపై చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయముక్కలు, చింతపండు వాటర్, సన్నకారప్పూస, బంగాళాదుంపల ముద్దను వేసి బాగా గరిటెతో బాగా కలపాలి. అంతే భేల్ పూరి రెడీ. తక్కువ కేలరీల ఆహారం ఇది. రుచికరమైనది కాబట్టి పిల్లలకు తినడానికి ఎంతో ఇష్టపడతారు.

No comments:
Post a Comment