చాలా సార్లు మీరు బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంలో మీ లోపల దాగి వుండే సంక్లిష్ట ప్రపంచాన్ని విస్మరిస్తారు. మీ అంతరంగాన్ని మీరు తెలుసుకోవడానికి మీరు నిజంగా
ఎన్ని ప్రయత్నాలు చేసారు? సరే, ఇప్పటిదాకా చేయకపోతే, మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీ జీవితంలో అంతర్భాగమైన విషయాలను విశ్లేషించుకోవడానికి ఇదిగో మీకు ఇదొక అవకాశం. మీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే విషయాల జాబితా ఇదిగో :మీకు ఇష్టమైన సినిమాలు :మీరు చూసే సినిమాలు కూడా మీరు ఎలాంటి వ్యక్తో తెలియచేస్తాయి. మీరు ప్రేమ సినిమాల వీరాభిమాని అయితే, మీరు ఒక ప్రేమికుడై వుంటారు, అలాగే జీవితం పట్ల ఒక సరదా వైఖరి కలిగి వుంటారు. మీరు సాహస లేదా భయానక సినిమాలు అభిమానిస్తే, మీరు అధ్బుతమైన అనుభవాలు కోరుకునే సాహసికులు. మెడకు మేత కావాలనుకునే మేథావులు సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడతారు.

No comments:
Post a Comment