Tuesday, May 28, 2013

మహిళలు బరువు పెరిగితే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..!


ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒక్కటిగా చెప్పవచ్చు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల ఊబకాయం సమస్య మరింత పెరుగుతూ వస్తోంది. శరీరంలో అవసరమైనదానికి కన్నా ఎక్కువ మొత్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల ఊబకాయమనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఊబకాయం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. అయితే ఈ ఊబకాయం అనే సమస్య పురుషుల్లో కంటే మహిళల్లోనే కాస్త ఎక్కువగా ఉంటోంది. పురుషుల్లో ఊబకాయం అనేది సాధారణ వైద్య లక్షణాలుగానే పరిగనిస్తారు. అయితే మహిళలల్లో ఏర్పడే ఊబకాయం సైకలాజికల్ గా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. అధిక బరువు ఉన్న మహిళల్లో ఊబకాయం తనతోపాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు వెంటబెట్టుకు వస్తుంది. రక్తపోటు, పలురకాల గుండెజబ్బులతోపాటు రుతు(మెనుస్ట్రువల్) సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక వ్యా«ధులకు ఊబకాయం కారణమవుంది. ఊబకాయం వల్ల మహిళల్లో ముఖ్యంగా రుతు సమస్యల దారితీస్తుంది. దాంతో రుతుక్రమంలో తేడాలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి యుక్త వయస్సు ఉన్న ఊబకాయుల్లో ఉండే అతి సాధారణ సమస్య. ఊబకాయం వల్ల సంతానలోపం, వయస్సు మీద పడినట్టు కనపించడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఊబకాయం వల్ల మహిళల్లో ఇంకా గర్భాశయంలో పాలిసిస్టిక్ ఓవరీస్ మరియు హార్మోనుల అసమతుల్యత వంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. మహిళల్లో ఊబకాయం వల్ల మానసిక ప్రభావాలు కూడా చాలా ఉన్నాయి. శరీరంలో అధనంగా పెరిగే క్రొవ్వు వల్ల శరీరం యొక్క చర్మ మీద అసహ్యమైన చారలు(స్ట్రెచ్ మార్క్స్)మరియు పాదాల పగుళ్ళకు దారితీస్తుంది. ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తుంది. అంతే కాదు ఊబకాయం ఉన్న మహిళల్లో మరికొన్ని ఎఫెక్ట్స్ ఏంటో ఒకసారి పరిశీలించండి..
ర్రెగ్యులర్ పీరియడ్స్: శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు వల్ల ఈ కొవ్వు యూట్రస్(గర్భాశయం)చుట్టు పేరుకుపోవడం వల్ల గర్భశాయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో పీరియడ్స్ లో మార్పులు జరుగుతాయి. వేపుళ్ళు, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఇలా జరగవచ్చు.


1 comment:

  1. బాగుంది . తెల్సిన విషయమే అయినా ఇలా మరలా మరలా గుర్తు చేసుకోవడం వలన కొంత ప్రయోజనం ఉంటుంది .

    ReplyDelete