మెరుపు కోల్పోయిన అనేక వస్తువులకి పలు విధాలుగా ఉపయోగపడే నిమ్మకాయతో తిరిగి వాటికి పూర్వపు మెరుపు ని తెప్పించవచ్చు అని తెలుసా??సిట్రిక్ యాసిడ్ అధికం గా ఉన్న నిమ్మ రసం అతి ప్రభావంతమైన సహజ క్లీనింగ్ ఏజెంటు. తక్కువ పీహెచ్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండటం వల్ల ఇది వస్తువులని శుబ్రపరచడం లో బాగా ఉపయోగపడుతుంది.నిమ్మ వాసన చాలా బాగుండటమే కాకుండా నిమ్మరసం ఉపయోగించి మీరు శుభ్రం చేసే బట్టలు లేదా చెక్క వస్తువులకి ఏ మాత్రం హాని జరగదు.
కూరగాయలు తరిగే బోర్డు: ఎక్కువగా వాడటం వల్ల చాపింగ్ బోర్డ్ నల్లగా అయి రంగు కోల్పోయి ఉంటాయి.చబద్ హోమ్మేకింగ్ వారి ప్రకారం చాపింగ్ బోర్డుని నిమ్మరసంతో కనుక శుభ్రపరిస్తే మరలా తెల్లబడుతుంది.

No comments:
Post a Comment