Friday, April 5, 2013

గర్భం ధరించిన మొదటి 3నెలలు ఈ ఆహారం చాలా అవసరం...!


గర్భం ధరించిన మొదటి మూడు నెలలో చాలా ముఖ్యమైన దశ. గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత వహించాలి. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రత్యేకంగా నిబంధనలతో ప్రెగ్నెన్సీ డైయట్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భం ప్రోటీన్ మరియు క్యాల్షియం ఆహారాలను ప్రధానంగా చేసుకుంటుంది. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. మొదటి మూడు మాసాల్లో తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీనులు ఒక జీవికి ప్రాణం పోస్తుందనడంలో ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతే కాదు మొదటి మూడు నెలల్లో కడుపులో బిడ్డ పరిమాణం కూడా వేగంగా పెరుతుంది. మొదటి మూడు నెలల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం చాలా అవసరం. కడుపులో బిడ్డ తల్లి యొక్క రక్తం శోషణ ద్వారా పెరుగుతుంది. అందుచేత మీరు మీ గర్భం ధరించిన ప్రారంభ దశలో క్యాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ మహిళలకు గుడ్డు అత్యుతమ ఆహారం. ఇది తల్లికి పూర్తి పోషణ అందిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెల్లో తీసుకోవల్సి అటువంటి అత్యుత్తమ ఆహారాలను పరిశీలించండి....

ఆకుకూరలు: ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.

No comments:

Post a Comment