ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్ర్తీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావ డానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్ ఏర్పడినప్పు డు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి... 1.మంచి నీళ్ళను ధారాళంగా తాగాలి. దీనివల్ల మూత్రం పల్చబడుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల సాల్ట్స్, ఖనిజ లవణాలు కాన్సెంట్రేట్ కాకుండా ఉండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. రోజూ సుమారున రెండు మూడు లీటర్లు నీరు తాగడం మంచిది. వేసవి కాలంలో ఇంకా ఎక్కువ తాగాలి. 2.కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో 92 శాతం కాల్షియం మూలంగానూ, కాల్షియం ఉత్పత్తుల మూలంగానూ ఏర్పడుతుంటాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉన్న వాళ్ళు కాల్షీయం ఉత్పత్తుల్ని పూర్తిగా మానేయకూడదు. గాని తగు మోతాదులో మితంగా మాత్రమే తీసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది కాల్షియం అధికంగా ఉండే పధార్థాలు - పాలు, వెన్నలాంటి డైరీ ఫుడ్స్ తీసుకోవాలి. 3. కొన్ని రకాల యాంటాసిడ్స్ కాల్షియం అధికంగా ఉంటుంది. మీరు కిడ్నీలో కాల్షియం స్టోన్స్ ఉండి, మీరు యాంటాసిడ్ టాబ్లెట్లను వాడుతుంటే ఆ టాబ్లెట్ లు కాకుండా చూసుకోండి. డాక్టరు సలహా మేర మరో బ్రాండ్ యాంటాసిడ్స్ని వాడండి. 4. కిడ్నీ స్టోన్స్ ఏ రకమైనవి ఉన్నాగాని విటమిన్ ‘‘ ఎ '' అధికంగా కల ఆహారాన్ని తీసుకొంటే అది యూరినరీ ట్రాక్ లైనింగ్ లో కలుగచేసే మార్పులవల్ల మరిన్ని రాళ్ళు ఏర్పడకుండా ఉపకరిస్తుంది. అయితే విటమిన్ ఎ కల మందులను మాత్రం తీసుకోవద్దు. 5. శారీరకంగా పనీ చేయకుండా ఉండే వాళ్ళ రక్త ప్రవాహంలో కాల్షియం పేరుకునే ప్రమాదం వుంది. అదే ఏదో ఒక పనిలో పాల్గొంటూ శారీరకంగా చురుకుగా వుంటే రక్తంలోని కాల్షియం ఎముకలలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రోజూ వ్యాయామంలో పాల్గొనడం మంచిది. 6.మనం ఆహారంలో తీసుకునే మాంసకృత్తుల (ప్రోటీన్స్) పరిమాణానికి కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి దగ్గర సంబంధం ఉంది. ప్రొటీన్లు మూత్రంలో యూరిక్ యాసిడ్నీ, కాల్షియంనీ, ఫాస్పరస్నీ పెంచుతుంది. దానివల్ల కొందరిలో కిడ్నీ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. 7. విటమిన్ సి కాల్షియం స్టోన్స్ - ముఖ్యంగా యూరిక్ యాసిడ్, ఉంటే మాంసాహారం ద్వారా మీరు తీసుకునే ప్రొటీన్ పరిమాణాన్ని తగ్గించండి. 8. విటమిన్ సి కాల్షియం ఆక్సాలేట్ స్టోన్ ని పెంకుతుంది. విటమిన్ ‘డి' శరీర భాగాలన్నింటిలోనూ కాల్సియంని పెంచుతుంది. కాబట్టి కిడ్నీ పేషేంట్లు ఈ రెండు మిటమిన్లనూ డాక్టరు సలహా మేర పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. 9. మూత్రం పోస్తున్నప్పుడు దానినుంచి రాయి పడితే ఆ రాయిని సేకరించి భద్రంగా దాన్ని డాక్టర్లకు చూపించితే వారు దానిని లాబొరేటరికి పంపించి విశ్లేషింపచేసి అలాంటివి ముందు ముందు ఇంకా ఏర్పడకుండా తగు వైద్యాన్ని సూచించుతారు. 10. ఈ ప్రొటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు. రాళ్లను నిర్లక్ష్యం చేస్తే, వాటి పరిమాణం పెద్దదై మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారుతుంది. మూత్ర నాళం సన్నగా మారడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, ఒక్కోసారి క్యాన్సర్ వ్యాధికి కూడా ఇది దారితీయవచ్చు.

No comments:
Post a Comment