Friday, March 15, 2013

కీళ్ళ నొప్పులు..కీళ్ళ వాపులను సహజంగా నివారించడం ఎలా...?


ఈ సమస్య మహిళల్లో చాలా సాధరణ సమస్యగా మారింది. వయస్సు పెరిగే కొద్ది మహిళల్లో కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు అధికం అవుతుంటాయి. అయితే దీన్ని నుండి బయటపడటం ఎలా ?.చికిత్స ఏంటి అని చర్చించుకుంటుంటాం. ఈ సమస్య నివారంచండ తెలుసుకోడం పెద్ద కష్టమైన పనేం కాదు.?అయితే ఇటువంటి సమస్య ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల వచ్చి తర్వాత నయం చేసుకోవడం కంటే సులభం. చాలా వరకూ ఈ సమస్య క్యాల్షియం లోపం వల్ల ఏర్పడుతుంది. కానీ క్యాల్షియం ఒక్కదాన్ని పొందడం వల్ల కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులను నయం చేసుకోలేం. కొన్ని సందర్భాలో ఒబేసిటి(ఊబకాయం)లేదా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కూడా బోన్ హెల్త్ కు చాలా చెడు ప్రభావం చూపెడుతుంది. సాధారణంగా మహిళల్లో మోనాపాజ్ దశకు చేరుకొన్న తర్వాత ఇటుంటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి పోస్ట్ మోనోపాజ్ చేరుకొనే ముందే బోన్ హెల్త్ గురించి తెలుసుకొన్నట్లైతే, ఈ సమస్యను సులభం నివారించుకోవచ్చు. ఈ సమస్య నివారణకు సహజంగా పాటించే ఒక మంచి మార్గం మన శరీరం ఫిట్ గా మరియు యాక్టివ్ గా ఉండేట్లు చూసుకోవడమే. అందుకు కొన్ని విలువైన పద్దతులు మీకోసం.... ఒబేసిటి(ఊబకాయం): ఒబేసిటి (ఊబకాయ) కీళ్ళనొప్పలు/కీళ్ళ వాపులకు బెస్ట్ ఫ్రెండ్ వంటిది. కాబట్టి మీ బరువును కనుక కంట్రోల్ చేసుకొన్నట్లైతే , మీ ఎముకలు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. క్యాల్షియం రిచ్ ఫుడ్స్ తప్పక తీసుకోవాలి: ఆస్టియోపొరెసిస్(కీళ్ళనొప్పులు,వాపుల)కు కారణం కాల్షియం లోపమే. మహిళల్లు వారి శరీరంలో క్యాల్షియం చాలా సులభం కోల్పోతుంటాయి. కాబట్టి మహిళలు అధిక క్యాల్షియం ఉండేటటువంటి ఆహారాలు పాలు, డైరీ ప్రొడక్ట్స్, ఆకు కూరలు, బ్రొకోలీ, సీఫుడ్స్,మొదలగునవి డైలీ డైయట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. శారీరక నొప్పులు ఎటువంటివైన నెగ్లెక్ట్ చేయకండి: ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఓస్టియోపొరొసిస్ కు దారితీస్తుంది. కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. బోన్ టెస్ట్ చేయించకోడం ఉత్తమం. క్ర్యాష్ డైయట్: క్ర్యాష్ డైయట్ తీసుకొనే ఆహారంలో సమయాన్ని పాటించకపోవడం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినడం. క్ర్యాష్ డైటింగ్ వల్ల మీ శరీర బరువు అతి త్వరగా తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. దాంతో ఉన్నఫలంగా శరీరంలోని క్యాల్షియం నిల్వలు, కొన్నిన్యూట్రీషియంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి రోజూ టైమ్ టు టైమ్ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామం: ప్రతిరోజూ వ్యాయామం చేసినట్టైతే మీ ఎముకలు ఫ్లెక్సిబుల్ గా మారుతాయి. ఏదైనా సరే ధీర్ఘకాలం పాటు చేస్తేనే మంచి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఎముకలు బలాన్ని పొందుతాయి. క్యాల్షియం సప్లిమెంట్: మోనోపాజ్ దశ చేరుకోగానే, మన శరీరంలో ఎముకల బలానికి సహాయపడే ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిముఖం పడుతుంది. కాబట్టి క్యాల్షియం సప్లిమెంట్స్ ను తీసుకోవడం మొదలు పెట్టండి. సన్ బాత్: విటమిన్ డి సహాయం లేకుండా మీ శరీరంలో క్యాల్షియం ఉత్పత్తి కాదు. విటమిన్ డి పొందాలంటే సన్ లైట్ మన శరీరం మీద పడేలా చూసుకోవాలి. కాబట్టి ప్రతి రోజూ ఉదయం వచ్చేసూర్యరశ్మిలో కొద్దిసేపు గడపడం వల్ల మీ శరీరానికి విటమిన్ డి అందుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించినట్లైతే ఓస్టియోపొరొసిస్ ను సులభంగా నేచురల్ పద్దతిలో నివారించుకోవచ్చు
.


No comments:

Post a Comment