చికెన్ కబాబ్స్ రుచిలో అద్భుంతమైన టేస్ట్ ను ఇస్తాయి. కాబట్టి వాటి టేస్ట్ ను పొగడలేకుండా ఉండలేం. అయితే చికెన్ తో తయారు చేసే వంటకం హెల్తీగా వండటం తెలియదు. చికెన్ హెల్త్ బెనిఫిట్స్ పొందడానికి ఎక్కువగా సూప్స్, సలాడ్స్, సాండ్విచ్ లను ఆరగిస్తుంటారు. అయితే ఈ చికెన్ గ్రిల్డ్ కబాబ్ కూడా హెల్తీ స్నాక్ అని చెప్పవచ్చు. అయితే దీన్ని వండటానికి సరైన వస్తువులు ఉపయోగించినప్పుడే మంచి రుచి వస్తుంది. ఈ చికెన్ కబాబ్ కు ఎప్పుడు ఉపయోగించని కాంబినేషన్లో తేనెను వినియోగిస్తారు. తేనె చేర్చడం వల్ల వెరైటీ టేస్ట్ ను అందిస్తుంది. ఇక ఈ చికెన్ కబాబ్ కు కారంగా ఉండటానికి కారణం ఇందులో ఉపయోగించే క్యాప్సికమ్, మరియు బ్లాక్ పెప్పర్ పౌడరే. అందుకే ఇది సహజంగా హెల్తీ చికెన్ రిసిపి అంటారు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం... చికెన్ ముక్కలు: 10(skinless weighing about 250 grams) బేబీ ఆనియన్స్(చిన్న ఉల్లిపాయలు): 6 బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్: 1 (diced and cubed) వెల్లుల్లి రెబ్బలు: 4 తేనె: 1tbsp సోయా సాస్: 2tbsp బ్లాక్ పెప్పర్ పౌడర్: 1tbsp వైట్ ఆయిల్: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం: 1. ముందుగా ఒక బౌల్లో ఒక చెంచా నూనె మరియు తేనె, బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు సోయా సాస్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి(గిలకొట్టాలి). ఇది చికెన్ ముక్కలకు మ్యారినేట్ చేయడానికి. 2. ఇప్పడు వెల్లుల్లి రెబ్బను చితగొట్టుకోవాలి. వీటిని ముందుగా తయారు చేసుకొన్న మ్యారినేటెడ్ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకవోాలి. 3. ఇప్పుడు చికెన్ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు అన్నింటిని మారినేషన్ కు మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమంలో వేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి ఫ్రిజ్ లో రెండు మూడు గంటలు పెట్టాలి. 4. రెండు గంటల తర్వాత బయటకు తీసి స్టాక్స్ లేదా స్కీవర్స్ మ్యారినేట్ అయిన చికెన్ ముక్కలతో సహా, ఉల్లిపాయ, టమోటో వంటి వాటిని కూడా గుచ్చాలి. ఇప్పుడు వీటి మీద ముందుగా మిగిల్చిన మ్యారినేట్ మిశ్రమాన్ని మరోసారి చిలకరించాలి. 5. వీటి మీద ఇప్పుడు కొద్ది నూనె కూడా చిలకరించి మైక్రోవోవెన్ లో గ్రిల్ చేసి 200డిగ్రీ వద్ద బేక్ చేసుకోవాలి. 6. దీన్ని 15 నిముషాల పాటు కుక్ చేయాలి. మద్య మద్యలో మారినేట్ మిశ్రమాన్ని చిలకరిస్తుండటం లేదా స్పూన్ తో రాయడం వల్ల చికెన్ ముక్కలు పూర్తిగా డ్రై కాకుండా గ్రీసీగా ఉంటాయి. 7. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పది నిముషాల అలాగే పెట్టడం వల్ల మారినేషన్ మిశ్రమం బాగా పట్టి మరింత టేస్టీగా తయారవుతుంది. అంతే ఈ హెల్తీ చికెన్ కబాబ్స్ ను బ్రెడ్ లేదా రోటీతో సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటాయి. కొన్ని ఉల్లిపాయలు లేదా కీరకాయ ముక్కలు గార్నిష్ చేయడం వల్ల రంగు రుచి, వాసనతో పాటు ఆకర్షణీయంగా కనబడుతాయి.

No comments:
Post a Comment