Friday, July 13, 2012

కొంచెం కారం... కొంచెం పులుపు..పులిహోర...!

Tamarind Pulihora Tangy Rice Dish
సాదారణంగా మనం పులిహోరలను రకరకాలుగా చేసుకొంటాము. సౌత్ ఇండియన్ వంటకాల్లో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో పులిహోర కూడా ఉంటుంది. అయితే టామరిండ్ పులిహోర.................................
కూడా ఒక మంచి అల్పాహారం. ఇది పుల్లపుల్లగా.. కారం కారంగా నోరూరిస్తుంటుంది. ఇందులో కొన్ని సువాసనలిచ్చే పదార్థాలను చేర్చడం వల్ల రుచితో పాటు సువాసన కూడా బాగుంటుంది. చింతపండును ఉపయోగించడం వల్ల అందులో ఎక్కువగా మినరల్స్ , విటమిన్స్, జీర్ణశక్తికి ఉపయోగపడే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో చాలా విటమిన్లు ఉంటయి. థైమన్, విటమిన్ ఎ, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లివిన్, నయసిన్, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతాయి.
కావలసిన పదార్థాలు:
రైస్ : 2cups
చింతపులుసు: 5tsp
పచ్చిమిర్చి: 6-8
ఎండు మిర్చి: 2-4
ఉల్లిపాయ: 1
వేరుశగలు(పల్లీలు): 1/4cup
జీడిపప్పు: 1tbsp
ఆవాలు: 1tbsp
శెనగపప్పు, ఉద్దిపప్పు: 2tbsp
ఇంగువ: చిటికెడు
మెంతి : చిటికెడు
పసుపు: 1/4tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు : రుచికి తగినంత
నూనె: సరిపడా
చింతపండు(టామరిండ్) పులిహోర తయారు చేయు విధానం:
1. ముందుగా రెండు కప్పుల బియ్యంను శుభ్రం చేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత రెండు కప్పుల బియ్యంకు నాలుగు కప్పుల నీళ్ళు పోసి అన్నంను పొడి పొడిగా వండుకోవాలి. (లేదా బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి గంజిని వంపేసుకోవచ్చు)అన్నం ఉడికేటప్పుడు ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి.
2. అంతలోపు చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి అందులో చింతపండు వేసి నానిన తర్వాత బాగా కలిపి గుజ్జును సపరేట్ చేసుకోవాలి.
3. అలాగే పచ్చిమిర్చి, కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. వీటిని కట్ చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులోనూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించి వెంటనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి, వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.
5. తర్వాత అందులోనే పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, వేరుశెనగపప్పు, జీడిపప్పు, వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే పసుపు, ఇంగువ, మెంతి పొడి వేసి ఒక నిమిషం తర్వాత చింతపండు గుజ్జును వేసి బాగా మిక్స్ చేయాలి. తక్కువ మంట లో రెండు నిమిషాలు ఉండనిచ్చి క్రిందికి దింపుకోవాలి.
6. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న అన్నం చల్లార్చి, దానికి పులిహోర గుజ్జును కలపాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే టామరిండ్(చింతగుజ్జుతో)పులిహోర రెడీ..

No comments:

Post a Comment