ప్రస్తుత జీవన విధానంలో చాలా వరకూ ప్రతి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు
ఉద్యోగాలి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు. ఇక ఇద్దరున్న ఇంట్లో భార్య, భర్త
ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆ ఇంట్లో నిద్ర లేచిన మొదలు,...................
పడకొనే వరకూ ఉరుకుల
పరుగులే. అలాంటి జీవన విధానంలో వారి కావల్సిన నిత్యవసర వస్తువుల కోసం
వారాని ఒక్కసారైనా షాపింగ్ చేయాల్సిందే. వారమంతా సరిపడే నిత్యవసరాలను
కొనుగోలు చేయాల్సిందే. కొంతమంది టైమ్, డబ్బును బట్టి వారానికి ఒకసారి లేదా
నెలకు ఒక సారి షాపింగ్ చేసి వారానికో లేదా నెలకో సరిపడా నిత్యవసర
వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే పట్టణాలలో ఆహార, నిత్యవసర
వస్తువులను నిల్వ ఉంచడం వల్ల ఇంటికి తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టినా, లేదా
బయట డబ్బాలో వేసి మూత పెట్టినా కొన్ని సార్లు అవి చెడిపోతుంటాయి. లేదా
పురుగులు పడుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ షెల్ప్ లైఫ్ ఫుడ్
ఎలా నిల్వ చేయాలి తెలుసుకోవాల్సి ఉంటుంది. పాడయినాయని లేదా కుళ్ళి
పోయినాయని పారవేయడమే లేద కట్ చేయడమో చేస్తుంటాం. అయితే అంత ఖరీదు పెట్టి
తెచ్చేటి చెడిపోకుండా చూడటం కూడా మన బాధ్యతే. అందుకోసం ఇక్కడ కొన్ని
సులభమైన చిట్కాలను ఇస్తున్నాం. అందుకోసం ఎక్కువ శ్రమపడాల్సిన పనిలేదు.ముఖ్యంగా ఆకు కూరలు, తాజా కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో
ప్రోటీన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు అధికంగా వుండి ఆరోగ్యంగా ఉండటానికి
ఎక్కువగా దోహదం చేస్తాయి. కాబట్టి ఆకుకూరలైనా, కూరగాయలైన గది ఉష్ణోగ్రత
కొన్ని కూరగాయలు సరిపోతుంది. మరికొన్నింటి సరిపోదు అంటువంటిప్పుడు అవి
పాడవడం జరుగుతుంటాయి. అటువంటప్పుడు వాటిని న్యూస్ పేపర్ లో చుట్టు
రిఫ్రిజరేటర్ లో వెజిటేబుల్ డ్రాలో భద్ర పరచుకొంటే ఒక వారం పాటు తాజాగా
ఉంటాయి.
2. చాలా మంది అనుకొంటారు నూనెలు పాడవవని. అయితే కొన్ని
న్యూట్రిషనల్ విలువలున్న నూనెలు ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ సరిగ్గా
నిల్వచేయకపోతే వాటిలోని పోషకవిలువలు పూర్తిగా తగ్గిపోతాయి. గది ఉష్ణోగ్రత
ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వేడి నూనెలను ప్రై ప్రభావం చేపి నూనెల యొక్క నాన్యత
తగ్గిపోతుంది. కాబట్టి ఆయిల్ నిల్వ ఉంచే డబ్బాలు, లేదా బాటిల్స్ వంటివి
మైక్రోవోవెన్ కు లేదా గ్యాస్ స్టౌ కు దూరంగా ఉంచాలి. నూనెను ఏదైనా ఒక వంటకు
ఉపయోగించిన తర్వాత వాటిని తిరిగి ఉపయోగిచకూడదు. వేడి నూనెను నిల్వ
చేయకూడదు.
3. పచ్చిమిర్చి వాడరని వాళ్ళంటూ ఉండరమో. మిరపకాయను
తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి , ఘాటు గుర్తుకు వస్తుంది .. కాని మిరప
లేకుండా వంట సాగదు , పచ్చి , పండు , ఎండు మిరప లను మనము వాడుతాం . మిరప
భారతీయ మొక్క కాదు . మన వారు కారం కోసం మిరియం వాడేవారు. ఏదో ఒక
సందర్భములోనైనా పచ్చిమిర్చి వాడక తప్పుదు. రుచితో పాటు కారంగా ఉండే ఈ
పచ్చిమిర్చి ఒక రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనిలో ఉండే
"కాప్సాసిన్(Capsaicin)" కీళ్ళ నొప్పులు , తలనొప్పి , మున్నగు నొప్పులను
తగ్గిస్తుంది. కాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. స్థూల కాయం ఉన్నా వాళ్లు కి
బరువు తగ్గెండుకు ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య గుణాలున్న వీటిని సరిగా
నిల్వ చేయక పోతే అవి కుళ్ళి పోతాయి లేదా వాడిపోతాయి. కాబట్టి గాలి చొరబడని
ప్లాస్టిక్ డబ్బా లేదా ప్లాస్టిక్ కవర్ లో వేసి నిల్వచేసుకోవాలి.
4.
మనం సాధారణంగా వండిన పదార్థాలను ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు అనుకుంటాం
అయితే ఆ నిల్వ చేసే పదార్థాలు వేడి గా ఉన్నటువంటివి నిల్వ చేయకూడదు.
పూర్తిగా చల్లారిన తర్వాత అవి నిల్వ చేసే గిన్నెలకు కానీ, పాత్రల మీద కానీ
తప్పని సరిగా మూతలు ఉండేలా చూసుకోవాలి. లేదంటా వాటి వాసనలు ఇతర పదార్థాల
మీద వ్యాపించి తినడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా
నిల్వలకు దోహదం చేస్తుంది. కాబట్టి మూతలు గట్టిగా ఉన్న వాటిలో వండిన ఆహార
పదార్థాలను నిల్వచేసుకోవడం మంచిది.
5. స్టోరింగ్ డైరీ ప్రొడక్ట్స్
(పాల ఉత్పత్తులు) నిల్వ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ
ఉత్పత్తుల మీద త్వరగా బ్యాక్టీరియా చేరడం జరగుతుంది. కాబట్టి పాలను ఎప్పుడు
బయటకు తీసిన పది, పదిహేను నిమిషాల తర్వాత బాగా కాచాలి. మళ్ళీ ఫ్రిజ్ లో
నిల్వ చేయాలనుకొంటే చల్లారి తర్వాత ఫ్రిజ్ లోపెట్టుకోవచ్చు. అయితే ఈ కాచడం
అనేది క్రమంగా జరగుతుండాలి.
6. వెన్న వంటి పదార్థాలను నిల్వ
చేయదలచుకొన్నప్పుడు వాటిని గాజు కంటైనర్ లోనే నిల్వచేసుకోవాలి. చీజ్ ను బయట
కొన్న తర్వాత రిఫ్రిజరేటర్ లో నిల్వ చేయడానికి ముందు దాని మీద ఉన్న
ప్లాస్టిక్ కవర్ ను తొలగించాలి. తర్వాత ఒక పేపర్ లో చుట్టి పెట్టుకోవచ్చు
లేదా గాజు కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. లేదంటే ఆ చల్లదనం అంతా మిగతా
పదార్థాలపై పడి అవి పాడయ్యేలా చేస్తాయి. కాబట్టి చీజ్ ను ప్రతి రెండు
రోజులకొక్కసారి బయటకు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ లోపల పెడుతుండాలి.
కాబట్టి ఈ హోం ఇంప్రూమెంట్ చిట్కాలతో మీ షెల్ఫ్ లైఫ్ ఫుడ్ కొద్దిరోజుల పాటు తాజాగా ఉండే విధంగా ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసుకోవచ్చు.

No comments:
Post a Comment