
బంగాళదుంప: 2(పొట్టతీసి కట్ చేసుకోవాలి)
మటన్: 1kg
ఉల్లిపాయ: 3-4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
చెక్క: చిన్న ముక్క...............
యాలకులు: 4-5
బిర్యాని ఆకు: 2
పచ్చిమిర్చి: 4-5
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 4tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టమోటో :4-5(గుజ్జులా తయారు చేసుకోవాలి)
కారం: 1tsp
ధనియా పౌడర్: 11/2 tbsp
గరం మసాలా పౌడర్: 1 1/2 tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయల ముక్కలు, మటన్ పీసెస్స్, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యాని ఆకులు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఒక కప్పు నీళ్లు ప్రెజర్ కుక్కర్లో వేసి మూత పెట్టి 25-30నిమిషాల పాటు ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అందులోనే టమోటో గుజ్జ వేసి మరో రెండు నిమిసాలు వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా వేసి బాగా వేయించాలి. మసాలా అంతా వేగుతూ నూనె పైకి తేలుతుంది అప్పుడు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప వేసి బాగా కలపాలి.
4. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న మటన్ మిశ్రమాన్ని కడాయిలోకి వంచుకోవాలి. ఈ మొత్త మిశ్రమాన్ని మరో పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. నీళ్ళు కావాలనుకొంటే కొద్దిగా పోసుకొని బంగాళదుంప మొత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.
5. అందులోనే రుచికి తగినంత ఉప్పు, మరికొంచె గరం మసాలా, బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి, సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని హాట్ హాట్ గా రైస్, చపాతి లేదా రోటీ లతో సర్వ్ చేయాలి . అంతే ఆలూ మటన్ రెడీ.
No comments:
Post a Comment