
తాగవచ్చు లేదా వైట్ రైస్ తో మిక్స్ చేసి భోజనం చేయవచ్చు. అయితే రసం వివిధ రకాలుగా, విభిన్న రుచులుతో చేస్తారు. అందులో ఒకటి ‘లెమన్ రసం'. దీన్ని కొంచెం తీపిగా, కొంచెం పుల్లపుల్లగా ఉండే ఈ లెమన్ రసం తయారు చేయడం చాలా సులభం. రుచికి కూడా చాలా బాగుంటుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. కాబట్టి ఈ లెమన్ రసంను మీరూ తయారు చేసి చూడండి.
కావలసిన పదార్థాలు:
టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
కందిపప్పు: 1cup(వేడి నీళ్ళల్లో నానబ్టెట్టాలి)
రసం పొడి: 2tsp
నిమ్మకాయ: 1
అల్లం: చిన్న ముక్క(తురుముకోవాలి)
పచ్చిమిర్చి: 2(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
పసుసు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తమీర: కొద్దిగా
పోపు కోసం:
నెయ్యి: 1tsp
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
కరివేపాకు : ఒక రెమ్మ
ఇంగువ: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా కంది పప్పును కుక్కర్ లో వేసి ఒకటి లేదా రెండు విజిల్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత ఈ పప్పును నున్నగా పామి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు, తరిగిపెట్టుకొన్న టమోటో ముక్కలు, పసుపు, రసం పొడి, పచ్చిమిర్చి, అల్లం తురుము మరియు కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకూ ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న కందిపప్పును, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ సేపు కాగనివ్వకూడదు. ఎక్కువ సేపు మరిగించడం వల్ల రుచి పోతుంది.
4. కొద్దిసేపటి తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో నిమ్మరసం పిండుకోవాలి.
5. ఇప్పుడు పాన్ లో నెయ్యిని వేసి కాగిన తర్వాత అందులో పోపుదినుసులు వేసి వేగనివ్వాలి.
6. చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి హాట్ హాట్ గా వైట్ రైస్ తో సర్వ్ చేయాలి. అంతే నిమ

No comments:
Post a Comment