Wednesday, June 13, 2012

మీల్‌ మేకర్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు
మీల్‌ మేకర్‌ - 200 గ్రాములు,
ఉల్లిపాయలు - 100 గ్రాములు
క్యారెట్‌ - 100 గ్రాములు,..............

బఠాణీలు - 100 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు,
కొత్తిమీర - 1 కట్ట
పచ్చిమిర్చి - 10,
కార్న్‌ఫ్లోర్‌ - 1 స్పూన్‌
అజినమోటో - 1 స్పూన్‌ సోయాసాస్‌ - 4 స్పూన్లు
వెనిగర్‌ - కొద్దిగా
ఉప్పు - తగినంత
మైదా - 2 స్పూన్లు
తయారు చేసే విధానం
మరిగే నీళ్లలో మీల్‌ మేకర్‌ పది నిమిషాలు ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ , పచ్చిమిర్చి, క్యారెట్‌, బఠాణీలు ఉడికించాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, సోయాసాస్‌, అజినమోటో, ఉప్పు, వెనిగర్‌ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించాలి. అందులోనే వేయించిన మంచూరియా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకుంటే చాలు... నోరూరించే మీల్‌ మేకర్‌ మంచూరియా రెడీ.

No comments:

Post a Comment